గోవా సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్..!!

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.

దీంతో ఐదు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.ఐదు రాష్ట్రాలలో ఒకటి గోవా రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా గోవాలో కూడా పోటీ చేస్తూ ఉండటం తో.పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.

ఆప్ సీఎం అభ్యర్థి అమిత్ పాలేకర్ అని ప్రకటించడం జరిగింది.ఈ నేపథ్యంలో గోవా సంస్కృతి సంప్రదాయాలను ఆమ్ ఆద్మీ పార్టీ పరిరక్షిస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

అమిత్ పాలేకర్ ఆధ్వర్యంలో ఆమ్ఆద్మీ పార్టీకి గోవా ప్రజలు.పట్టం కడతారని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఎప్పటినుండో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ బృందం ప్రచారంలో ముమ్మరంగా వ్యవహరిస్తోంది.

ఒక్క గోవాలో మాత్రమే కాక పంజాబ్ లో అయితే.గ్యారెంటీ అధికారం ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కటం అని సర్వే లు వస్తున్నాయి.

ఈనేపథ్యంలో గోవాలో పార్టీ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ నీ.కేజ్రీవాల్ ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కొత్తిమీర పంటను మాగుడు తెగుళ్లు నుండి సంరక్షించే పద్ధతులు..!