కరోనా విషయంలో కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయం..!!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీలో అందుకు భిన్నంగా కేసులు తగ్గుతూ ఉండటంతో.

కేజ్రీవాల్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతోంది.విషయంలోకి వెళితే దేశంలో అందరి కంటే ముందు వీకెండ్ కర్ఫ్యూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఢిల్లీలో అమలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు కేసులు తగ్గుతూ ఉండటం తో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయడం మాత్రమేకాక 50% కెపాసిటీతో ప్రైవేట్ ఆఫీసులకు అనుమతులు ఇవ్వడానికి కూడా.

కేజ్రీవాల్ ప్రభుత్వం సన్నద్ధమైంది.ఈ నేపథ్యంలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ కి కేజ్రీవాల్ ప్రభుత్వం పంపించడం జరిగింది.

గత కొద్ది రోజులుగా దేశ రాజధానిలో కేసులు తగ్గుతూ ఉండటం తో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 ఇదిలా ఉంటే దేశంలో కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి.మహారాష్ట్ర అదేరీతిలో ఢిల్లీలో భారీగా కేసులు నమోదవుతున్నాయి.

దీంతో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేస్తూ కరోన ఆంక్షలు.

కఠినంగా అమలు చేస్తూ ఉన్నాయి.అయితే ప్రస్తుతం దేశంలో రోజుకి లక్షలలో కొత్త కేసులు వస్తున్న సమయంలో.

ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?