పోలీస్ పాత్రలో మహానటి..!
TeluguStop.com
మళయాళ నటి కీర్తి సురేష్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చిందని చెప్పొచ్చు.
మహానటితో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత సినిమాలు చేసినా వరుస ఫ్లాపులు అందుకుంది.
తమిళంలో సానికాయుధం సినిమాతో హిట్ అందుకున్న కీర్తి సురేష్ తెలుగులో సర్కారు వారి పాటతో కూడా హిట్ అందుకుంది.
ప్రస్తుతం నాని దసరా సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ కోలీవుడ్ లో జయం రవి హీరోగా వస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది.
ఈ సినిమాని ఆంటోని డైరెక్ట్ చేస్తున్నారు.అయితే ఈ సీనిమాలో కీర్తి సురేష్ రోల్ రివీలైంది.
సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ పాత్రలో కనిపిస్తుందట.చిన్ని సినిమాలో కీర్తి సురేష్ కొద్దిసేపు పోలీస్ పాత్రలో మెప్పించింది.
కానీ రాబోతున్న జయం రవి సినిమాలో ఆమె పూర్తిస్థాయిలో పోలీస్ పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.
జయం రవి కీర్తి సురేష్ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు.
మొన్నటిదాకా గ్లామర్ షో విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గిన కీర్తి సురేష్ ఇప్పుడు స్కిన్ షోకి కూడా సై అనేస్తుంది.
సర్కారు వారి పాట సినిమాలో ఒక పాట కోసం కీర్తి సురేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.
కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!