తనలోని హిడెన్ టాలెంట్ బయటపెడుతున్న కీర్తి సురేష్
TeluguStop.com
టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్న అందాల భామలు కేవలం నటనకే పరిమితం కాకుండా ఇతర రంగాలలో కూడా తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు.
వారిలో ఉన్న టాలెంట్ ని అప్పుడప్పుడు పరిచయం చేస్తూ ప్రేక్షకులని, ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తారు.
అలాంటి భామలలో రాశిఖన్నా, నిత్యా మీనన్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్నారు.వీళ్ళు కేవలం నటులుగానే కాకుండా గాయకులు కూడా తమ సత్తా చాటారు.
రెగ్యులర్ సింగర్స్ కంటే భాగా పాడి వీరు పాడిన పాటలు సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాగే రాశి ఖన్నా మంచి గిటారిస్ట్ కూడా.ఆమెలోని ఉన్న మ్యుజీషియన్ ని రీసెంట్ గా ఒక వీడియోతో పరిచయం చేసింది.
ఇప్పుడు ఈ కోవలో అభినవ మహానటి కీర్తి సురేష్ కూడా చేరబోతుందని ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తే అర్ధమవుతుంది.
నటిగా ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ తాజాగా తన అక్క రేవతి సురేష్ తో పాటు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే గాయనిగా కూడా ప్రూవ్ చేసుకున్న ఈ భామ ఇప్పుడు తనలోని వయోలినిస్ట్ ని పరిచయం చేసింది.
మొత్తానికి అందాల భామలు కేవలం తమ గ్లామర్ తోనే కాకుండా ఇలా హిడెన్ టాలెంట్ తో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ తమ గురించి పరిచయం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ కాగా, సర్కారువారిపాట సినిమాతో మహేష్ బాబుకి జోడీగా నటిస్తుంది.
దీంతో పాటు అరడజనుకి పైగా ప్రాజెక్ట్ లు ఈమె చేతిలో ఉన్నాయి.
బాలయ్య, వెంకటేష్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి తో ఉన్నారా..?