బన్నీతోనే సై అంటున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఏకంగా ఇంత ధైర్యం ఏంటంటూ?

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy Suresh)గురించి మనందరికీ తెలిసిందే.కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

మొదట నేను శైలజ సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మహానటి, దసరా లాంటి మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు తెలుగులో భారీగా క్రేజ్ ని ఫాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

ఇకపోతే కీర్తి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో రఘు తాతా సినిమా( Raghu Thatha ) ఒకటి.

సుమన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. """/" / ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంగీత దర్శకుడు షాన్ రోల్డన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.ఇటీవల ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రఘు తాతా చిత్రం ఆగస్టు 15 విడుదల కానుందని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

అంతా బాగానే ఉంది కాని రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త రిస్క్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

ఎందుకంటే అదే రోజున, ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2( Pushpa 2 ) కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.

"""/" / చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.ఈ రకమైన పోటీతో కీర్తి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా రాణిస్తుందో, ప్రేక్షకులకు ఎలాంటి అనుభవం అందిస్తుందో చూడాలి.

ఏమాత్రం తేడా వచ్చినా కూడా కలెక్షన్స్ పై గట్టి ప్రభావం పడుతుంది.కాబట్టి రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచించి వాయిదా వేసుకుంటే బెటర్.

ఆర్టిస్టులకు రాజమౌళి కొత్త కండిషన్స్ పెడుతున్నాడా..?