Keerthy Suresh : నిన్న అనుపమ నేడు కీర్తి సురేష్.. అలాంటి సీన్స్ లో నటించడానికి కీర్తి సురేష్ ఓకే చెప్పారా?

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇకపోతే అనుపమ అటు సినిమాల్లో కానీ ఇటు రియల్ లైఫ్ లో కానీ ఎప్పుడు పద్ధతి గానే కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

సాంప్రదాయకరమైన కట్టు బొట్టుగా కనిపిస్తూ ఉంటుంది.అలాంటిది ఆమె ఆ హద్దులు అన్ని చెరిపేస్తూ రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ సీన్లతో హీటెక్కించిన విషయం తెలిసిందే.

అదే అభిమానులకు పెద్ద షాక్ అనుకుంటుంటే ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square )లో కూడా లిప్ లాక్స్ సీన్ లతో రెచ్చిపోయి మరొక సారి అభిమానులకు షాక్ ఇచ్చింది.

"""/" / దాంతో అనుపమలో ఈ ఊహించ‌ని మార్పుకి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఇప్పుడు అనుప‌మ బాట‌లోనే కీర్తి సురేష్ కూడా ప్ర‌యాణించ‌బోతోంద‌ని టాక్‌.కీర్తి సురేష్ కి ఒక ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ ఉంది.

మ‌హాన‌టి( Mahanati )తో ఆమె జాతీయ అవార్డు కూడా సంపాదించుకుంది.ప‌ద్ధ‌తైన పాత్ర‌ల‌కు త‌ను కేరాఫ్ అడ్ర‌స్స్‌ గా కూడా నిలిచింది.

అయితే కొంత‌కాలంగా ఆమెకు అవ‌కాశాలు ద‌క్క‌డం లేదు.మిగిలిన హీరోయిన్ లతో పోటీ త‌ట్టుకోలేక‌పోతోంది.

దాంతో మ‌ళ్లీ గాడిలో ప‌డ‌డానికి కీర్తి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.ఈ నేప‌థ్యంలో ఆమెకు ఒక బాలీవుడ్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

బాలీవుడ్ సినిమా అంటే రెండో ఇన్నింగ్స్‌కు బ‌ల‌మైన పునాది పడిన‌ట్టే అని చెప్పవచ్చు.

అయితే స‌ద‌రు సినిమాలో లిప్ లాక్ స‌న్నివేశం ఉంద‌ట‌. """/" / మొద‌ట అలాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి నిరాక‌రించిన కీర్తి, ఆ త‌ర‌వాత ఒప్పుకోవాల్సి వ‌చ్చింద‌ట‌.

కీర్తిని ఇలాంటి స‌న్నివేశాల్లో చూడ‌డం అభిమానుల‌కు కాస్త ఆశ్చ‌ర్యంగా అనిపించవచ్చు.కానీ త‌ప్ప‌డం లేదు.

అయితే మొదటి నుంచి కీర్తి సురేష్ ని అభిమానులు కేవలం మంచి మంచి పాత్రలో మాత్రమే చూసారు.

ఈ జ‌న‌రేష‌న్ హీరోయిన్ల పోటీని త‌ట్టుకొని రావాలంటే కొన్ని రూల్స్‌ని ప‌క్క‌న పెట్టాల్సిందే.

కీర్తి, అనుప‌మ అదే చేస్తున్నారు.మున్ముందు ఇంకెంత మంది హీరోయిన్లు వీళ్ల బాట‌లో నడుస్తారో నడవాల్సి వస్తుందో చూడాలి మరి.