వచ్చే ఏడాది మూడు పెద్ద సినిమాలతో రాబోతున్న కీర్తి సురేష్
TeluguStop.com
కీర్తి సురేష్ కు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది.
తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇప్పటికే వరుస బెట్టి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు మహానటి లాంటి హిస్టారికల్ మూవీతో నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయిపోయింది.
మరీముఖ్యంగా మహానటి మూవీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఆమె నటనకు ఫిదా కాని వారంటూ లేరు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
దాంతో ఆమెకు స్టార్ డమ్ వచ్చేసింది.పెద్ద హీరోల సరసన ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
రీసెంట్ గానే నితిన్‌తో చేసిన మూవీ మంచి హిట్ కొట్టింది.ఇప్పటి దాకా ఏడాదికి ఒకటి లేదంటే రెండు సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న కీర్తి సురేష్ రాబోయే సంవత్సరంలో తన హవా చూపించేందుకు రెడీ అవుతోంది.
వచ్చే ఏడాది ఏకంగా మూడు పెద్ద సినిమాలతో తెరమీద కనిపించబోతోంది.ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ అని తెలుస్తోంది.
"""/"/
2022 సంక్రాంతి సందర్భంగా వస్తున్న సర్కారు వారి పాట మూవీతో ఆమె మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కనిపించబోతోంది.
ఇక దాని తర్వాత భోళా శంకర్ మూవీతో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించి మెప్పించేదుకు రెడీ అవుతోంది.
ఇక దీంతో పాటే మరోసారి నానితో దసరా మూవీతో పలకరించేందుకు రెడీ అవుతోంది.
వీటన్నింటిపై పెద్ద ఎత్తున అంచానలు ఉన్నాయి.ఈ మూడు సినిమాలతో ఆమె స్టార్ డమ్ మరింత పెరిగే ఛాన్స్ పక్కా అంటున్నారు ఆమె అభిమానులు.
మరి ఏ మేరకు ఈ సినిమాలు ఆడుతాయో చూడాలి.
పుష్ప 2 విషయం లో అతి జాగ్రత్త మొదటికే మోసం వస్తుందా..?