దసరా డైరెక్టర్ అలా పిలవడం నచ్చలేదన్న నెటిజన్… క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్?
TeluguStop.com
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) తాజాగా నాచురల్ స్టార్ నాని(Nani)తో కలిసి దసరా సినిమా ( Dasara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో పెద్దగా ఆదరణ పొందలేక పోయిన సౌత్ ఇండస్ట్రీలో మాత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైన వారంలోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరి నాని సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని ఇద్దరు కూడా డి గ్లామర్ పాత్రలలో నటించి సందడి చేశారు.
ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) అనేదర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.
"""/" /
ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం మొత్తం సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు లేకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి ముచ్చటించారు.
నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఈ సమాధానాలు చెబుతూ వచ్చారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ కీర్తి సురేష్ ను ప్రశ్నిస్తూ మిమ్మల్ని దసరా డైరెక్టర్ షూటింగ్ లొకేషన్లో మీరు అని కాకుండా నువ్వు అని పిలుస్తూ వచ్చారు.
మిమ్మల్ని అలా పిలవడం నచ్చలేదు అలా పిలవడం మీకు ఓకేనా అంటూ ప్రశ్నించారు.
"""/" /
ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ సమాధానం చెబుతూ కొన్ని ప్రాంతాలలో ప్రేమతో ఇతరులను నువ్వు అని పిలుస్తూ ఉంటారు.
శ్రీకాంత్ కూడా అలాంటి ప్రాంతం నుంచే వచ్చారు.నేను కూడా తన తల్లిని తన అమ్మమ్మను నువ్వు అని పిలుస్తాను అలాగని వారిపై నాకు ప్రేమ, రెస్పెక్ట్ లేదని అర్థం కాదు.
శ్రీకాంత్ కూడా నాపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే తనని నువ్వు అని పిలిచారు అంటూ సమాధానం చెప్పారు.
ఇక మీ పట్ల గౌరవం చూపించిన వారి పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తారని మరొక నెటిజన్ అడగడంతో వారు గౌరవం ఇవ్వకపోయినా నేను గౌరవం ఇస్తూనే ఉంటానని కీర్తి సురేష్ ఈ సందర్భంగా చెప్పిన సమాధానాలు వైరల్ అవుతున్నాయి.
ట్రోల్స్ ఎఫెక్ట్… డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటి… షాకింగ్ విషయాలు రివీల్?