కీర్తి సురేష్ ఆ సినిమాలో ఆఫర్ కోసం ఎదురుచూస్తుందా ..?

కీర్తి సురేష్ ఆ సినిమాలో ఆఫర్ కోసం ఎదురుచూస్తుందా ?

మహానటి సినిమాతో తన పేరును భారతదేశంలో ఉన్న చిత్ర పరిశ్రమలో అందరికీ తెలిసేలా చేసుకుంది కీర్తి సురేష్.

కీర్తి సురేష్ ఆ సినిమాలో ఆఫర్ కోసం ఎదురుచూస్తుందా ?

మహానటి సినిమాతో ఊహించని క్రేజ్ ని సంపాదించడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

కీర్తి సురేష్ ఆ సినిమాలో ఆఫర్ కోసం ఎదురుచూస్తుందా ?

ఒకవైపు తన క్యారెక్టర్ కి ఉన్న పాత్రలను చేస్తూ మరోవైపు కమర్షియల్ సినిమాల వైపు చేస్తూ అప్పుడప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది కీర్తి సురేష్.

ప్రస్తుతం కీర్తి సురేష్ కి మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రంగ్ దే, అన్నత్తో, అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ప్రస్తుతం ఇన్ని సినిమాలతో ఊపిరాడకుండా ఉన్నంత షెడ్యూల్ బిజీగా ఉన్న కానీ కీర్తి సురేష్ మరో సినిమా వైపు ఆశగా ఎదురు చూస్తోందట.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ఓ భారీ ప్రాజెక్టు తో తాను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఆవిడ ఎదురుచూస్తున్నట్లు సినీ వర్గాల వారి టాక్.

ఇందుకు ప్రత్యామ్నాయంగా నే అటువైపు అడుగులు వేస్తున్నట్లు వినికిడి.ప్రస్తుతం బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా తీసేందుకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ హీరోగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సీత క్యారెక్టర్ కు ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా పాపులర్ పొందిన కియారా అద్వాని, కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరందుకుంది.

కాకపోతే ప్రభాస్ పక్కన ఆదిపురుష్ సినిమాలో కీర్తి సురేష్ అన్న విషయం చాలా మందికి కొత్తగా అనిపిస్తుంది.

అంతేకాదు.కీర్తి సురేష్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ ఓ పండుగలా అనిపిస్తుంది.

ఈ విషయంపై ప్రస్తుతం కీర్తి సురేష్ భారీ ఆశలు పెట్టుకుంది.దీనికి కారణం ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కడం, అలాగే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి సరైన సమయం అని కీర్తి సురేష్ గంపెడు ఆశలు పెట్టుకుంది.

మరి ఇన్ని ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ కి ఆదిపురుష్ టీం అవకాశం ఇస్తుందో లేదో హీరో ప్రభాస్ పుట్టిన రోజు వరకు వేచి చూడాల్సిందే మరి.

దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో నటింప చేసేందుకు తమిళ, తెలుగు సినిమాల దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.