అనిరుద్ తో కీర్తి సురేష్ పెళ్లి… క్లారిటీ ఇచ్చిన తండ్రి?
TeluguStop.com
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి కీర్తి సురేష్(Keerthi Suresh) తరచూ పెళ్లి గురించి వార్తలలో నిలుస్తూ ఉంటారు.
గత కొన్ని రోజులుగా ఈమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈమె పెళ్లి గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఎన్నోసార్లు ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించి ఈ వార్తలను ఖండించారు.
అయినప్పటికీ ఈమె పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు ఇక ఈ వార్తలపై తన తండ్రి కూడా స్పందించి అలాంటిది ఏదైనా ఉంటే ముందుగా మీకే చెబుతాము అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.
"""/" /
ఇలా పెళ్లి విషయంలో కీర్తి సురేష్ తన తండ్రి ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ కీర్తి సురేష్ పెళ్లి(Marriage) వార్తలకు మాత్రం అడ్డుకట్టు వేయలేకపోతున్నారు.
తాజాగా ఈమె మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravichandran) తో ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ మరొక వార్త వైరల్ అవుతుంది.
ఇలా అనిరుద్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ వస్తున్నటువంటి వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు.
కీర్తి పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నీ నిరాధారణమైనవి అని తెలియజేశారు. """/" /
ఇక కీర్తి సురేష్ గురించి ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు ఇదివరకే ఆమె గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే అనిరుద్ తో తన పెళ్లి అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలను ఎవరో కావాలనే ప్రచారం చేస్తున్నారని ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.
ఇక వీరిద్దరి పెళ్లి అంటూ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.అనిరుద్ కీర్తి సురేష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు.
కీర్తి సురేష్ నటించిన కొన్ని సినిమాలకు అనిరుద్ సంగీతం అందించారు.అలాగే వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి పెళ్లి అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.
ప్రభాస్ దారిలో నడుస్తున్న అక్కినేని హీరో.. ఆ బ్యానర్ లో నటించనున్నారా?