డిసెంబర్ 11నే కీర్తి సురేష్ పెళ్లి… అధికారికంగా ప్రకటించిన తండ్రి సురేష్!
TeluguStop.com
సినీ నటి కీర్తి సురేష్( Keerthy Suresh ) పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈమె పెళ్లి గురించి తరచు ఏదో ఒక వార్త వినిపిస్తున్న తరుణంలో ఈ వార్తలు నిజం కాదని కీర్తి సురేష్ అలాగే తన తండ్రి సురేష్( Suresh ) కూడా తన పెళ్లి వార్తలను తోసిపుచ్చారు.
కీర్తి సురేష్ పెళ్లి( Keerthy Suresh Marriage ) గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
కీర్తి సురేష్ ఆంటోనీ తట్టిల్( Antony Thattil ) అనే ఒక వ్యాపారవేత్తతో ఏడడుగులు నడవబోతున్నారని వీరి వివాహం గోవాలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.
వీరి వివాహం డిసెంబర్ 11,12 తేదీలలో జరగబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. """/" /
ఇలా కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవడంతో ఆంటోనీ గురించి కీర్తి సురేష్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ విధంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇలా వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి నిర్మాత సురేష్ స్పందిస్తూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.
తన కుమార్తె కీర్తి వివాహం ఆంటోనీతో జరగబోతుందని ఈయన అధికారకంగా వెల్లడించారు. """/" /
కీర్తి సురేష్ కు గత 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఆంటోని తట్టిల్ తో వివాహం జరగబోతుందని వీరి వివాహం గోవాలోని ఒక రిసార్ట్ లో డిసెంబర్ 11వ తేదీ జరగబోతున్నట్లు ఈయన అధికారకంగా వెల్లడించారు.
ఇక ఈమె పెళ్లి గురించి అధికారకా ప్రకటన రావడంతో కీర్తి సురేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కీర్తి సురేష్ అభిమానులు ఆంటోని కీర్తి ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ గుండు పాప ఎవరో గుర్తు పట్టారా.. ఈ మధ్యే హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?