'మహేష్ బాబును నేను మూడు సార్లు కొట్టాను'.. కీర్తి షాకింగ్ కామెంట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కిన విషయం విదితమే.

ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచాయి.

అలాగే వచ్చిన పోస్టర్స్ కూడా ఆకట్టు కున్నాయి.ఇక నిన్న ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ అయితే మరొక రేంజ్ లో అలరించింది.

మహేష్ బాబు గత సినిమాల కంటే మరింత యంగ్ గా, చార్మింగ్ లుక్ తో అందరిని మెస్మరైజ్ చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.

ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

"""/" / మరి ఈ సినిమా రిలీజ్ కు 10 రోజులు మాత్రమే ఉండడంతో ప్రొమోషన్స్ లో వేగం పెంచేశారు.

ఈ క్రమంలోనే తాజాగా కీర్తి సురేష్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది.ఈ సినిమాలో మహేష్ పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

అలాగే ఈ షూట్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందని మహేష్ అంత సరదాగా ఆ సన్నివేశాన్ని తీసుకుంటాడని నేను అనుకోలేదని తెలిపింది.

మహేష్ తో ఒక సాంగ్ చేస్తున్నప్పుడు నా టైమింగ్ మిస్ అయ్యింది.స్టెప్పులు మర్చిపోయాను.

ఆ సమయంలో నా చెయ్యి ఆయన ముఖానికి రెండు సార్లు తగిలింది.వెంటనే నేను సారీ కూడా చెప్పాను.

అయినా మూడవసారి కూడా గట్టిగ కొట్టినట్లు తగిలింది.దీంతో వెంటనే నేను ఏమైనా తప్పు చేసానా నీకు అని అనేసారు మహేష్ సర్.

ఈయన అలా సరదాగా తీసుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది'' అంటూ చెప్పుకొచ్చింది మహానటి.