కాలేజీ రోజుల్లో కీర్తి సురేష్ ని చూశారా?
TeluguStop.com
నేను శైలజ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.
మహానటి సినిమాతో సావిత్రిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది ఈ భామ.ఇక ఈ లాక్ డౌన్ లో కూడా ప్రజలను ఆకట్టుకున్న హీరోయిన్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తారు.
కీర్తి సురేష్ అని.ఎందుకంటే ఓటిటిలో ఒక సినిమా రిలీజ్ అవుతేనే ఏడిచే వారు ఉన్నారు.
అలాంటిది ఈమె సినిమాలు రెండు రిలీజ్ అయ్యాయి ఓటిటిలో.పెంగ్విన్ సినిమాతో ఓటిటిలో పలకరించిన కీర్తి సురేష్ మిస్ ఇండియాతో మళ్లీ వచ్చింది.
రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి కానీ కీర్తి సురేష్ నటన కోసం ఆ సినిమాలను చూసేలా ఉన్నాయ్.
అయితే ప్రస్తుతం గుడ్ లక్ సకి అనే సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ తన కాలేజీ స్నేహితురాలు పెళ్ళికి హాజరైంది.
నిజానికి ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అంతా కూడా రీల్ లో మాత్రమే ఉండకుండా రియల్ లో కూడా ఉండి అందరిని ఆనందపరుస్తున్నారు.
"""/"/
ఇక ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ కూడా తన స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళింది.
దీంతో కీర్తి సురేష్ పాత ఫోటోలు అన్ని బయటపడ్డాయ్.కీర్తి సురేష్ తన స్నేహితులతో కాలేజీ సమయంలో ఉన్న ఫోటోలు బయటపడ్డాయ్.
ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.ఎందుకంటే ఆ ఫోటోలలో కీర్తి సురేష్ నల్లగా ఉండడమే కాకుండా అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంది.
ఏంటి ఇక్కడ ఉన్నది కీర్తి సురేషా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఉంది.ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఆ ఫోటో ఏంటో మీరు ఒకసారి చూడండి.
వీడియో వైరల్.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ.. ఎందుకంటే?