Keerthy Suresh : పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్.. ఘోరంగా అవమానించిన నెటిజన్స్?

అప్పుడప్పుడు జనాలు సెలబ్రిటీలను బాగా అవమానిస్తూ ఉంటారు.ఎక్కువగా వారి అందాల విషయంలలో ట్రోల్ చేస్తూ ఉంటారు.

మామూలుగా హీరోయిన్లు కూడా లుక్ కు తగ్గట్లుగా తయారవుతూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు గెటప్ కు తగ్గ తయారవలసి ఉంటుంది.

క్లాస్ అంటే క్లాస్ గా మాస్ అంటే మాస్ గా తయారవలసి వస్తూ ఉంటుంది.

ఇక ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయి గెటప్ లో మాస్ గా కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా పల్లెటూరు అమ్మాయి గెటప్ లో కీర్తి సురేష్( Keerthy Suresh ) కనిపించగా ఆమెను ఘోరంగా ట్రోల్ చేశారు నెటిజన్స్.

మామూలుగా గత కొంతకాలం నుంచి కీర్తి సురేష్ లుక్ చాలా మార్పులు వచ్చాయి.

డీసెంట్ గా కనిపించే కీర్తి సురేష్ బయట మాత్రం బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.

2000 లో బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్( Malayalam Pilates ) సినిమా ద్వారా వెండితెర లో అడుగు పెట్టింది కీర్తి సురేష్.

తరువాత తమిళ సినిమాలలో నటించింది‌.ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను తన తొలి చూపులతోనే ఆకట్టుకుంది.

"""/" / ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.ఇక అప్పటివరకు కాస్త పద్ధతిగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత బాగా వర్క్ అవుట్ లు చేసి సన్నబడి గ్లామర్ షోను పరిచయం చేసింది.

సర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata ) సినిమాలో మాత్రం బాగా గ్లామర్ షో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

సోషల్ మీడియాలో కూడా నిత్యం హాట్ ఫోటోలు వదులుతుంది.ఇక ఆమెను అలా చూసి తన ఫాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు.

ఇలా ఎందుకు తయారయ్యావు అంటూ ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా హడావుడి చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే ఆమె ప్రస్తుతం నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

"""/" / ఇక ఈ సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇందులో నానితో ఈమె కూడా మాస్ లుక్ లో కనిపించింది.అచ్చం పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ అందరిని బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా బృందం ప్రమోషన్స్ భాగంలో బాగా బిజీగా ఉన్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను దసరా మూవీ కి సంబంధించిన తన ఫోటోను పంచుకుంది.

అందులో తన చీరకట్టులో ఉండగా తనను ఆ అవతారంలో చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేయటం మొదలుపెట్టారు.

పబ్లిక్ టాయిలెట్ దగ్గర కూర్చునే వాళ్ళు ఇలాగే ఉంటారు అంటూ ఒకరు కామెంట్ చేయగా.

కాస్ట్లీ బట్టలు వేస్తే కానీ కాస్ట్లీఫేస్ కుదరదు అన్నమాట నీది అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ ఫైర్