రాణి లుక్ లో కీర్తి సురేష్.. ఏ సినిమా కోసం అంటే?
TeluguStop.com
టాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ ను అందుకున్న ఈ బ్యూటీ.వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారింది.
స్టార్ హీరోల సరసన నటించి మొత్తానికి స్టార్ డమ్ అందుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాల్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
అంతేకాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' అనే సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా పోర్చుగీసు వారిని ఎదిరించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కనుంది.
"""/"/
ఇక ఈ సినిమాను గత ఏడాది మార్చి 26న విడుదల చేయాలని సిని బృందం అనుకోగ ఆ సమయంలో కరోనా ఫస్ట్ వేవ్ ఎదురయ్యింది.
మళ్లీ ఈ ఏడాది విడుదల చేయాలని అనుకోగా ఈసారి కరోనా సెకండ్ వేవ్ ఎదురయ్యింది.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు మంజు వారియర్, అర్జున్, కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ లుక్ విడుదల కాగా.
ఇందులో సంగీతకారిణిగా కేరళ యువరాణిగా ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తున్నట్లు కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారగా.ఇది చూసిన నెటిజనులు కేరళ యువ రాణిగా ఉందంట్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ఆగష్టు 12 న విడుదల చేయనున్నట్లు మోహన్ లాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్: ఇది మంత్రగత్తెల జైలు అట.. ఇందులోకి వెళ్లిన మహిళకు షాకింగ్ ఎక్స్పీరియన్స్..?