‘మిస్‌ ఇండియా’కు మొన్నటి వరకు పదికోట్లు ఇప్పుడు ఆరు కోట్లు

కీర్తి సురేష్‌ మహానటి చిత్రంతో తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది.అయితే రెగ్యులర్‌ కమర్షియల్‌ పాత్రలకు ఓకే చెప్పకుండా విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు కమిట్‌ అవుతూ వచ్చింది.

అలా మూడు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేసింది.అందులో ఇప్పటికే పెంగ్విన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెంగ్విన్‌ సినిమా ఫ్లాప్‌ అయ్యింది.

ఆ సినిమా నిరాశ పర్చడంతో కీర్తి సురేష్‌ క్రేజ్‌ తగ్గింది.పెంగ్విన్‌ సినిమా ప్రభావం ఆమె తదుపరి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలపై చాలా బలంగా పడ్డట్లుగా ఇండస్ట్రీ వర్గాలోల గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా మిస్‌ ఇండియా సినిమా విషయంలో చాలా మార్పు కనిపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ మిస్‌ ఇండియా సినిమాను సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు.అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అది సాధ్యం కాలేదు.

అయినా థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు.కాని ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మిస్‌ ఇండియా సినిమాను అమెజాన్‌ మొదటి నుండి కూడా 10 కోట్ల వరకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించింది.

కాని పెంగ్విన్‌ ఫలితం తర్వాత ఇప్పుడు అంత మొత్తం పెట్టేందుకు ముందుకు రావడం లేదు.

అయిదు నుండి ఆరు కోట్ల వరకు అయితే కొనుగోలు చేసేందుకు ఓకే అంటూ నిర్మాత వద్ద బేరాలు సాగిస్తున్నారు.

త్వరలోనే ఏదేని ఒక విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తప్పుడు ప్రచారం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట..: సీఎం రేవంత్