దసరా మీదే కీర్తి ఆశలు..!
TeluguStop.com
మహానటి గా తనని తాను ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh )తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గ్లామర్ సైడ్ కూడా కవర్ చేస్తుంది.
తనలోని గ్లామర్ యాంగిల్ తో ఆడియన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది అమ్మడు.సర్కారు వారి పాట తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న సినిమా దసరా.
( Dussehra ) ఈ సినిమాలో నాని ( Nani )తన నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు.
అయితే సినిమాలో కీర్తి సురేష్ ది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది.
అసలు కథ కీర్తి సురేష్ చుట్టే తిరుగుతుందని అంటున్నారు.సినిమాలో కీర్తి పాత్ర హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.
అందుకే కీర్తి సురేష్ కూడా దసరా సినిమా మీదే చాలా హోప్స్ పెట్టుకుంది.
ఈ సినిమా ఆమె ఆశలను నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు పెద్దగా ఆసక్తి చూపించని కీర్తి సురేష్ నాని మరోసారి కథ మొత్తం డీటైల్డ్ గా చెప్పించే సరికి ఓకే అనేసింది.
అంతకుముందు నానితో కలిసి నేను లోకల్ సినిమా చేసింది కీర్తి సురేష్.మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా కీర్తి సురేష్ సిస్టర్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో మరో థియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బన్నీ… ప్రత్యేకతలు ఇవే!