త్రిభాషా చిత్రానికి ఒకే చెప్పిన కీర్తి సురేష్ ! నగేష్ కుకుమార్ దర్శకత్వంలో!
TeluguStop.com
మహానటి సినిమాతో తెలుగు ప్రజల మదిని దోచుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇప్పుడు స్టార్ హీరోలకి జోడీ కడుతూ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
మహానటి తర్వాత తెలుగు సినిమాలకి గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ తమిళంలో స్టార్ హీరోలతో వరుసగా జతకట్టింది.
తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా జత కట్టే అవకాశం కీర్తి సొంతం చేసుకుంది.
ఇదిలా వుంటే మహానటి తర్వాత ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి కొత్త దర్శకుడుకి ఒకే చెప్పింది.
ఇది కాకుండా తాజాగా కీర్తి సురేష్ మరో ట్రై లింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ బ్లూస్ అనే సినిమాతో సక్సెస్ కొట్టిన బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే సినిమా అని తెలుస్తుంది.
ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏక కాలంలో రిలీజ్ చేసే అవకాశం వుందని తెలుస్తుంది.
Karamba Review And Player Reputation — A Practical UK Guide