అంతటి నొప్పిని ఎలా తట్టుకుందో.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి మనందరికీ తెలిసిందే.

కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

మొదట నేను శైలజ సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మహానటి, దసరా లాంటి మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తెలుగులో భారీగా క్రేజ్ ని ఫాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ తన స్నేహితురాలిని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్‌ అయింది.

ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆమె ఒక పోస్ట్‌ కూడా చేసింది. """/" / ఇటీవల బ్రెయిన్ ట్యూమర్‌ తో మరణించిన తన బెస్ట్ ఫ్రెండ్ మనీషా( Manisha ) గురించి కీర్తి పలు విషయాలను పంచుకుంది.

తన స్నేహితురాలితో ఉన్న బంధాన్ని సుదీర్ఘ పోస్ట్‌తో తెలిపింది.ఆసుపత్రిలో మనీషాను చూసినప్పుడు ఎలా ఏడ్చిందో గుర్తుచేసుకుంది.

కాగా హీరోయిన్ కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా కొద్దిరోజుల క్రితమే బ్రెయిన్ ట్యూమర్‌ తో చనిపోయింది.

ఇదే విషయాన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా కీర్తి ఇలా గుర్తు చేసుకుంటూ.కొన్ని వారాలుగా నేను చాలా బాధను అనుభవిస్తున్నాను.

నా చిన్ననాటి స్నేహితురాలు మనీషా ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లుతుందని అనుకోలేదు.

ఈ సంఘటన నమ్మశక్యంగా లేదు. """/" / 21 ఏళ్ల వయసులో తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌( Brain Tumor ) తో బాధపడుతున్న ఆమె గత నెల వరకు దాదాపు 8 ఏళ్ల పాటు పోరాడింది.

గత ఏడాది నవంబర్‌ లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది.అంతటి బాధను తట్టుకునే శక్తి ఆమెకు ఎలా వచ్చిందో అలాంటి సంకల్ప శక్తి ఉన్నవారిని నేను ఇప్పటి వరకు చూడలేదు.

కానీ ఒక్కోసారి నొప్పిని భరించలేకపోతున్నానంటూ ఆ బాధను తట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకునేది.ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ వద్ద నేను కూడా ఏడ్చేశాను.

కన్నీటితో నిండిన ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది.ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈ ప్రపంచాన్ని వదిలేసి పోయింది.

ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నేను చివరిసారిగా కలిశాను.చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన నా స్నేహితురాలు భవిష్యత్‌ పై ఎన్నో కలలు కనేది.

బతాకాలనే ఆశతో నా మనీషా చివరి శ్వాస వరకు పోరాడింది.కానీ దేవుడు దయ చూపలేదు.

ఆమె దూరమై సరిగ్గా నెలరోజులు అవుతుంది.తన గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు.

మనీషా లేకుండానే తన పుట్టినరోజు జరుపుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని తన ప్రాణస్నేహితురాలి మరణం గురించి చెబుతూ ఫుల్ ఎమోషనల్ అయ్యింది కీర్తి.

లండన్‌: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!