నడిరోడ్డులోనే కొట్టిస్తా… మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అంటూ అమర్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన కీర్తి?
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది అయితే బిగ్ బాద్ కార్యక్రమం మొదలైన తర్వాత వారికి సపోర్ట్ చేసే సెలబ్రిటీల విషయంలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.
ఒక కంటెస్టెంట్ ఫాన్స్ మరొక కంటెస్టెంట్ ఫ్యామిలీని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సీరియల్ నటి కీర్తి భట్ ( Keerthi Bhatt ) కూడా ఈ విధమైనటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
"""/" /
ఈమె స్టార్ మా సీరియల్స్ సెలబ్రిటీలకు సపోర్ట్ చేయకుండా గౌతం కృష్ణకు సపోర్ట్ చేయడంతో అమర్ ఫ్యాన్స్( Amar Fans ) ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ఇలా తన గురించి ఇష్టానుసారంగా మాట్లాడటంతో ఈమె సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కీర్తి స్పందిస్తూ మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.వారిని కూడా ఎవరైనా ఇలాగే అంటే మీరు బాధపడరా ఎందుకు నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారు.
బూతులతో కామెంట్లు చేస్తున్నారు అంటూ ఆవేదన చెందారు. """/" /
నేను హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ప్రియాంక మానస మహేష్ మాత్రమే సపోర్ట్ చేశారు నేను కూడా ఇండివిజువల్ గా గేమ్ ఆడుతున్నటువంటి గౌతమ్ కృష్ణకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను దానికి నన్ను ట్రోల్ చేస్తున్నారు.
నాపట్ల చెడుగా కామెంట్స్ చేసిన వాళ్లందరి ఐడి లను ట్రేస్ చేశానని ఇదిలాగే కంటిన్యూ అయితే మీరు ఎక్కడున్నా వెతుకొని వచ్చి మరి నడిరోడ్డున మీ అమ్మలతోనే కొట్టిస్తాను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇలా తన గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఈమె ఎమోషనల్ అవ్వడమే కాకుండా తన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారు.
ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?