ఆస్కార్ అందుకున్న నాటు నాటు సాంగ్ పై కీరవాణి షాకింగ్ కామెంట్స్… టాప్ సాంగ్ కాదంటూ?

చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు( Oscar Award ) రావాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ఆస్కార్ అవార్డు కూడా రాలేదు కానీ తాజాగా రాజమౌళి మాత్రం తన దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ( Naatu Naatu Song )ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికపై ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు.

"""/" / ఇలా ఆస్కార్ రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం అని చెప్పాలి.

ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ( M.M.

Keeravani ) తాజాగా రామ్ గోపాల్ వర్మ ( Ramgopal Varma ) ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కీరవాణి నాటు నాటు పాట గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ పాటని వేరే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి, ఆస్కార్ వచ్చుంటే.

దానికి అర్హత ఉందని మీరు భావించేవారా అంటూ వర్మ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు కీరవాణి సమాధానం చెబుతూఈ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ తర్వాత చెబుతాను అయితే ఈ పాటను జస్ట్ పాటగా మాత్రమే తీసుకుంటే తాను ఫీల్ కాను.

ఎందుకంటే జయహో పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా తాను ఫీల్ అవ్వలేదని కీరవాణి తెలిపారు.

"""/" / వర్మ మరోసారి ప్రశ్నిస్తూ.నాటు నాటు పాట మీ టాప్ 100 పాటలలో ఒకటిగా ఉందా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కీరవాణి సమాధానం చెబుతూ లేదని తెలియజేశారు.ఇక ఏదైనా మనం ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు అవతల వారికి నచ్చాలి అని ఆ పని చేస్తున్నప్పుడు ముందు ఆ పని మనకు నచ్చాలి.

మనకే నచ్చనప్పుడు ఇతర వ్యక్తులకు ఎలా నచ్చుతుందనీ అనుకుంటాను అంటూ కీరవాణి తెలియజేశారు.

ఇలా నాటు నాటు పాట గురించి కీరవాణి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3000 పాములను రక్షించిన స్టార్ యాక్టర్.. ఒకేసారి కాళ్లపై 16 నాగుపాములు పడ్డాయట..?