వర్మ మాట వినకపోవడం వల్ల ఈ రోజు బాధ పడుతున్న : కీరవాణి

తెలుగులో సంగీత దర్శకుడుగా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి కీరవాణి.రాజమౌళికి సోదరుడిగా పేరు రాక ముందే సంగీతంలో ఆయన కంటూ ఒక ప్రస్థానం ఉంది.

200 సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి జీవితంలో ఎలాంటి లోటు లేదు అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలపడం విశేషం.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో పాల్గొన్న కీరవాణి తన జీవితంలో ఉన్న ఏకైక రిగ్రేట్ గురించి తెలిపారు.

రాంగోపాల్ వర్మ దర్శకుడు గా పీక్ లో ఉన్న సమయంలో అతడు చెప్పిన మాట తాను వినలేదని అందుకోసం చాలా బాధపడుతున్నానని తెలిపారు కీరవాణి.

రామ్ గోపాల్ వర్మ క్షణం క్షణం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆ చిత్రానికి సంగీతం కీరవాణి చేత చేయించుకున్నాడు.

అయితే ఆ సమయంలోనే కీరవాణి కి వర్మ ఒక సలహా ఇచ్చారట.కెరీర్ లో ఎన్ని సినిమాలు అయిన చెయ్యి కానీ చేసే ప్రతి సినిమాలో ఈ మూడిట్లో ఒక్కటైన ఉండేలా చూసుకో.

అందులో ఒకటి ఒప్పుకున్న సినిమాలో స్టార్ హీరో అయిన ఉండాలి లేదా స్టార్ బ్యానర్ అయిన అయ్యి ఉండాలి అది కాదంటే స్టార్ బడ్జెట్ అయిన అయ్యి ఉండాలి.

ఈ మూడిట్లో ఈ ఒక్కటి లేకపోయినా ఆ సినిమా నువు చేయకు అని చెప్పారట.

"""/"/ కానీ వర్మ చెప్పిన ఆ మాట ఆ రోజు వినలేదు అని అందుకు గల కారణం పరిస్థితులు అని కీరవాణి తెలిపారు.

తనకు ఉన్న ఆర్థిక సమస్యలతో చచ్చులు, పుచ్చులు అనే తేడా లేకుండా ఏకంగా 250 సినిమాల వరకు చేశాను అని అందులో అన్ని హిట్స్ కావు అంటూ చెప్పారు.

కొన్ని మంచి సినిమాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆలోచిస్తే వర్మ చెప్పినట్టు అన్ని అలాంటి సినిమాలు తీస్తే ఈ రోజు కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేదని కూడా చెప్పారు.

ఈ రోజు నేను చాలా హ్యాపీ గా, ఆనందంగా ఉన్నాను కానీ వర్మ మాట విని ఉంటే ఇంకా బాగుండేది అని అప్పుడప్పుడు అనిపిస్తుందని తెలిపారు కీరవాణి.

ప్రశాంత్ వర్మ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోలు..ఈయన క్రేజ్ మామూలుగా లేదుగా…