Keeravani:ఆ స్టార్ నిర్మాత మనవరాలిని కోడలుగా చేసుకోబోతున్న కీరవాణి.. ఎవరంటే..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దపెద్ద ఫ్యామిలీ వాళ్లు వియ్యం ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు.ఓ స్టార్ హీరో కూతుర్ని మరో స్టార్ హీరో కొడుకుకి, స్టార్ హీరో కూతుర్లను యంగ్ హీరోలకు ఇలా సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఇలా బంధుత్వం ఉన్న ఫ్యామిలీలు చాలా ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ( Keeravani ) కూడా తన కొడుకుకి ఓ స్టార్ నిర్మాత మనవరాలని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు అంటూ టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇంతకీ కీరవాణి తన ఇంటికి కోడలుగా తెచ్చుకుపోయే ఆ స్టార్ నిర్మాత మనవరాలు ఎవరో కాదు నటుడిగా.
నిర్మాతగా.బిజినెస్ మాన్ గా.
ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్ అందరికీ తెలిసే ఉంటుంది.
"""/" / ఈయన కోటానుకోట్ల డబ్బులు సంపాదించిన మంచి పేరుని వ్యక్తి.
ఇక మురళీమోహన్ కి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు.ఆ కొడుకు కూతురు అనగా మురళీమోహన్ ( Murali Mohan ) మనవరాలి ని కీరవాణి కొడుకు సింహ( Simha ) కి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారట.
ఇక మురళీమోహన్ మనవరాలు రూపా మాగంటి వేలకోట్లకి అధిపతి.ఇక రూపా మాగంటి ( Roopa Maganti ) కి కీరవాణి రెండో కొడుకు సింహా అంటే చాలా ఇష్టమట.
ఈ కారణంతో ఇరు కుటుంబాలు మాటామంతి చేసుకున్నాయట.ఇక ఇరు కుటుంబాలు మాటవరకూ మాత్రమే ఉన్నాయి.
కానీ ఇంకా ఎలాంటి విషయాలు అనుకోలేదట. """/" /
అయితే అన్ని కుదిరితే ఈ ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చే ఏడాది పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారట.
అయితే టాలీవుడ్ మీడియాలో ఈ వార్త గట్టిగా వినిపిస్తున్నప్పటికీ కీరవాణి ఫ్యామిలీ గానీ, మురళి మోహన్ ఫ్యామిలీ గానీ ఈ వార్త నిజమే అని ఇంకా కన్ఫామ్ చేయలేదు.
మరి నిజంగానే కీరవాణి మురళీమోహన్ కుటుంబాల మధ్య బంధుత్వం కుదరబోతుందా.వీరి పెళ్లి నిజమేనా అనేది తెలియాలంటే కచ్చితంగా ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
199 సినిమాలు రిలీజ్.. 26 మాత్రమే హిట్.. 2024 సంవత్సరం సక్సెస్ పర్సెంటేజ్ ఇదే!