M M Keeravani : ‘తెలుసా.. మనసా..’ ట్యూన్‌ని కీరవాణి చేయలేదా.. మరి దీన్ని ఎవరు కంపోజ్ చేశారు…??
TeluguStop.com
సినిమాకి కథ ప్రాణమైతే, సంగీతం గుండెకాయ అని చెప్పుకోవచ్చు.సినిమాల్లో మ్యూజిక్ ఎంత బాగుంటే సన్నివేశాలు అంతా బాగా ఎలివేట్ అవుతాయి.
సందర్భానుసారం వచ్చే పాటలు లేదంటే మెలోడీ సాంగ్స్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్తాయి.
మంచి పాటలతో సినిమా వస్తే ఆ సినిమాని ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోరు కూడా.
సినిమాల్లో మ్యూజిక్ ఎక్కి ఎంత ప్రాధాన్యం ఉంటుంది కాబట్టే మ్యూజిక్ డైరెక్టర్లు మంచి ట్యూన్స్ కట్టడానికి చాలా కృషి చేస్తుంటారు తాము నేర్చుకున్న సంగీత విద్యనంతా పాటల కోసం ఉపయోగిస్తారు.
"""/" /
అయితే కొన్ని సందర్భాల్లో ఇతరులు ఇతర భాషల్లో కట్టిన ట్యూన్స్ ను మన ఇండియన్స్ వాడుతుంటారు.
ఇండియాలో ఇళయరాజా ఒక్కరే వేరే సంగీత దర్శకులు కంపోజ్ చేసిన టీమ్లను వాడుకోలేదు.
ఆయన ఇప్పటిదాకా కంపోజ్ చేసినవన్ని సొంతంగా క్రియేట్ చేసినవే.ఇక దిగ్గజ కీరవాణి ( Keeravani )చాలావరకు సొంత ట్యూన్లనే క్రియేట్ చేస్తారు.
కానీ ఎప్పుడైనా వేరే వారి క్రియేట్ చేసిన విజయం బాగా అనిపిస్తే వాటిని ఆయన దిగుమతి చేసుకుంటుంటారు.
అలాంటి ట్యూన్లలో తెలుసా మనసా సాంగ్ కూడా ఉంది. """/" /
నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాల ప్రధాన పాత్రలో నటించిన క్రిమినల్ సినిమా( Criminal Movie )లోని తెలుసా మనసా పాట ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు మహేష్ బట్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ కూడా అయింది.
అయితే ఇందులోని "తెలుసా మనసా." పాట ట్యూన్‌ను జర్మన్ బ్యాండ్ కంపోజ్ చేసింది.
ఆ బ్యాండ్ పేరు ఎనిగ్మా( Enigma ) ఈ ట్యూన్ ను 'ఏజ్ ఆఫ్ లోన్లీనెస్’ అనే పాట కోసం వారు కంపోజ్ చేశారు.
అయితే ఈ పాటలో లిరిక్స్ ఏమీ ఉండదు.హమ్మింగ్, మ్యూజిక్‌తో మాత్రమే ఇది సాగుతుంది.
ఆ రెండిటినీ కీరవాణి తెలుసా మానస సాంగ్ కి వాడేసుకున్నారు.అయితే ఆ పాట ఉన్నది ఉన్నట్లు కాకుండా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒక కొత్త ఫ్రెష్‌నెస్‌ని తీసుకొచ్చారు.
తెలుగువారికి నచ్చే నచ్చేలా దానిని చక్కగా మార్చేసి ఆకట్టుకున్నారు.ఈ పాట ముందు వచ్చే హమ్మింగ్ ను ప్రముఖ గాయని చిత్ర అద్భుతంగా ఆలపించింది.
వీడియో సాంగ్ కూడా మంచి విజువల్స్ తో అద్భుతంగా ఉంటుంది.ఇప్పటికీ దీన్ని వినే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీయార్ ల కోసం ఎదురుచూస్తున్న ఇతర భాషల స్టార్ డైరెక్టర్స్..