వల్లి నాకు దొరకడం నిజంగా నా అదృష్టం : కీరవాణి
TeluguStop.com
చాలా మంది తమ జీవిత భాగస్వామి తో పొంతన కుదరక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఒక వేళ ఇబ్బందులు ఉన్న కూడా సర్దుకు పోతూ ఉంటారు.ఎందుకంటే వివాహ బంధం అంటే అంతేగా మనకు నచ్చితే కలుపుకుపోవడం ఉన్నట్టే, నచ్చక పోతే విడిపోవడం కూడా ఉంటుంది.
అందుకే అనువైన కుటుంబం, భార్య దొరకడం చాలా మందికి అదృష్టమే.ఈ విషయం లో కీరవాణి ఓపెన్ అయ్యాడు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో తనకు వల్లి లాంటి భార్య దొరకడం నిజంగా ఒక అదృష్టం అంటూ చెప్పాడు.
వల్లి కుటుంబానికి ఒక మూల స్తంభం గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుతుంది అని మన అందరికి తెలిసిందే.
సినిమా జీవితం, వ్యక్తి గత జీవితం అంటూ కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు వేరుగా ఉండవు.
వారి జీవితంలో అన్ని ఓకే రకంగా ముడి పడి ఉంటాయి.అందుకే ఆ కుటుంబం నుంచి అన్ని విజయాలే బయటకు వస్తున్నాయి.
ఇక వల్లి డబ్బు మనిషి కాదు అని చెప్పాడు కీరవాణి.డబ్బులు అమే జీవితంలో అవసరం మాత్రమే కానీ కోరికలు లేవు.
అలాగే తోటి మనిషిని గౌరవించడం, ఎలాంటి వారి నుంచైనా విషయాన్ని పూర్తిగా విన్న తర్వాత మాత్రమే జడ్జ్ చేయడం ఆమెకు అలవాటు.
"""/"/
ఈ రెండు విషయాల్లో తనది వల్లిది ఓకే మాట అందుకే అమే లాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం అంటూ చెప్పుకచ్చాడు కీరవాణి.
ఇక వల్లి లక్షణాలని పుణికి పుచ్చుకున్న మరొక వ్యక్త రమ.వల్లి లాంటి అమ్మాయి కాబట్టే రాజమౌళి అమే చెయ్యి అందుకున్నాడు.
ఒక బిడ్డ తల్లి అయినప్పటికి మనుషులకు మాత్రమే, మనసులకు మాత్రమే విలువ ఇస్తుందని, అత్యాశ లేదనే కారణాలు అమే పై రాజమౌళి కి ప్రేమను కలిగించాయి.
అందరు అలా ఉంటే ఎంత బాగుండు కదా.డబ్బు మాత్రమే నడిపిస్తున్న ఈ సమాజంలో ప్రేమలు, బంధాలు ఎప్పుడో విలువను కోల్పోయాయి.
వెంకటేష్ ఈ సంక్రాంతి విన్నర్ నిలిచాడా..?