కీరా, పుదీనా.. ఈ రెండు ఇంట్లో ఉంటే ఆయిలీ స్కిన్‌కి బై బై చెప్పేయ‌వ‌చ్చు!

ఆయిలీ స్కిన్ లేదా జిడ్డు చ‌ర్మం.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.

రోజుకు ఎన్ని సార్లు నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకున్నా, ర‌క‌ర‌కాల ఆయిల్‌ ఫ్రీ ఫేస్ వాష్‌ల‌ను వాడినా చ‌ర్మం మ‌ళ్లీ కొద్ది సేప‌టికే జిడ్డు జిడ్డుగా మారిపోతుంటుంది.

దాంతో ఏం చేయాలో తెలీక‌, ఎలా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవాలో అర్థంగాక లోలోనే తెగ మ‌ద‌న ప‌డిపోతుంటారు.

అయితే కీరా, పుదీనా.ఈ రెండు ఇంట్లో ఉంటే గ‌నుక ఎంత‌టి జిడ్డు చ‌ర్మానికైనా బై బై చెప్పేయ‌వ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ ఆయిలీ స్కిన్‌ను వ‌దిలించుకోవ‌డానికి కీరాదోస‌, పుదీనాల‌తో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కీరాదోస తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి క‌చ్చ ప‌చ్చ‌గా దంచుకోవాలి.

అలాగే గుప్పెడు పుదీనా ఆకుల‌ను కూడా తీసుకుని లైట్‌గా క్ర‌ష్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.

అందులో రెండు గ్లాసుల నీటిని పోయాలి.నీరు కాస్త వేడి అవ్వ‌గానే అందులో కీరాదోస, పుదీనాల‌ను వేసుకోవాలి.

ఇప్పుడు నీరు స‌గం అయ్యే వ‌ర‌కు చిన్న మంట‌పై గరిటెతో తిప్పుకుంటూ బాగా మ‌రిగించుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఆపై ఈ వాట‌ర్‌ను ఐస్ ట్రేలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.

"""/"/ బాగా గడ్డ క‌ట్టిన త‌ర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి ఆ ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని ముఖానికి స్మూత్‌గా ర‌బ్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం చేసే గ‌నుక కీరా, పుదీనాల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు చ‌ర్మంపై పేరుకు పోయిన‌ అధిక జిడ్డును తొల‌గించి ముఖాన్ని ఫ్రెష్‌గా, కాంతి వంతంగా మారుస్తాయి.

మ‌రియు ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే పింపుల్స్‌, పింపుల్‌ మార్క్స్ వంటివి కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

తండ్రి కూరగాయల వ్యాపారి.. కూతురు యూపీఎస్సీ ర్యాంకర్.. స్వాతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!