ఈ సింపుల్ రెమెడీతో పాదాలను తెల్లగా మృదువుగా మెరిపించుకోండి!

చాలా మంది ఒంటిపై పెట్టే శ్రద్ధ పాదాల పై( Feet ) పెట్టరు.

కానీ బయటకు బహిర్గతం అయ్యే శరీర భాగాల్లో పాదాలు కూడా ఒకటి.అటువంటి పాదాలను అందంగా మెరిపించుకోవాలనే కోరిక దాదాపు అందరికీ ఉంటుంది.

అయితే ఆ కోరిక తీరాలంటే కచ్చితంగా పాదాలపై శ్రద్ధ వహించాలి.ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా తెల్లటి మృదువైన పాదాలను( Soft Feet ) మీ సొంతం చేసుకోవచ్చు.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా( Baking Soda ) వేసుకోవాలి.

అలాగే వన్ టీ స్పూన్ వాసెలిన్, వన్ టీ స్పూన్ తేనె మరియు రెండు టీ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బకెట్ లో గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి కలపాలి.

ఈ వాటర్ లో పది నిమిషాల పాటు పాదాలను నానపెట్టి కడుక్కోవాలి. """/" / ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం అర నిమ్మ చెక్కను తీసుకుని పాదాలను బాగా రుద్ది వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఫైనల్ గా తడి లేకుండా పాదాలను తుడుచుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేశారంటే అద్భుత ఫలితాలు పొందుతారు. """/" / ముఖ్యంగా ఈ రెమెడీ పాదాలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి,  చనిపోయిన చర్మం కణాలను తొలగిస్తుంది.

టాన్ ను రిమూవ్ చేస్తుంది.పాదాలను తెల్లగా మరియు మృదువుగా మారుస్తుంది.

కాబట్టి అందమైన మెరిసే పాదాలను కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

రాముడిలా కనిపించేవాళ్లు రావణుడిలా కనిపించకూడదు.. ముఖేష్ కన్నా కామెంట్స్ వైరల్!