ఒకే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అన్న, తమ్ముడు, చెల్లి.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువైన విషయం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువైన విషయం కాదు.
వరంగల్ జిల్లా చిన్ననాగారంకు చెందిన స్వప్న, కేదార్, బాలకృష్ణ (kedar, Swapna, Balakrishna)తమను చదివించడం కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తండ్రి పడుతున్న కష్టాన్ని వృథా పోనివ్వలేదు.
2008 డీఎస్సీలో కేదార్, స్వప్న(kedar Swapna) ఉద్యోగాలు సాధించగా ప్రస్తుతం వీళ్లు మర్రిపెడలో ఉన్న జెడ్.
ఎస్ లో పని చేస్తున్నారు.బాలకృష్ణ (Balakrishna )2014 సంవత్సరంలో ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడంతో పాటు ప్రస్తుతం ఖమ్మంలో సీఐగా పని చేస్తున్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్థుల ఆనందానికి సైతం అవధులు లేకుండా పోయాయి.
"""/" /
బొమ్మెర యాకలక్ష్మి, లచ్చయ్య గౌడ్(Bommera Yakalakshmi, Lacchayya Goud) సంతానం అయిన ఈ ముగ్గురు తమ సక్సెస్ తో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
లచ్చయ్య గౌడ్ దంపతులు కూలి పనులకు వెళ్తూ పిల్లలను చదివించగా ఆ కష్టం వృథా పోలేదు.
ప్రభుత్వ ఉద్యోగాలకు ఊహించని స్థాయిలో పోటీ నెలకొనగా ఇంత పోటీ ప్రపంచంలో కూడా కేదార్, స్వప్న, బాలకృష్ణ తమ లక్ష్యాలను సాధించారు.
"""/" /
ప్రభుత్వ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు కష్టపడితే ఏదో ఒకరోజు తమ టార్గెట్ ను సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది.
గవర్నమెంట్ జాబ్(Govt Job) సాధించడం మరీ కష్టం అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వీళ్ల సక్సెస్ కుటుంబ సభ్యులకు కలిగించిన ఆనందం అంతాఇంతా కాదని సమాచారం అందుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఆరోగ్యానికి వరం చుక్కకూర.. వారానికి ఒక్కసారి తిన్న లాభాలే లాభాలు!