ఓవర్సీస్ లో అరుదైన రికార్డుని నెలకొల్పిన ‘కీడా కోలా’..చిన్న సినిమాకి ఇంత వసూళ్లా!

'పెళ్లి చూపులు' మరియు 'ఈ నగరానికి ఏమైంది' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 'కీడా కోలా'( Keeda Cola ).

విడుదలకు ముందు ట్రైలర్ తో యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్, విడుదల తర్వాత ఆ ప్రమోషనల్ కంటెంట్ కి ఏ మాత్రం తక్కువ లేకుండా, ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలను ఏర్పాటు చేసిందో, ఆ అంచనాలకు మించే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.

స్టోరీ ఏమి లేదు, కానీ తీసుకున్న పాయింట్, దానిని తన టేకింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ రెండు గంటల స్వచ్ఛమైన కామెడీ ని పంచిన తరుణ్ భాస్కర్( Tarun Bhaskar ) టాలెంట్ ని మెచ్చుకోవాల్సిందే.

ఓపెనింగ్స్ తోనే 90 శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకొని ముందుకు దూసుకుపోతుంది.

"""/" / అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి హాఫ్ మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది అట.

కేవలం 80 లక్షల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి వీకెండ్ లోపే 5 రెట్లు లాభాలు వచ్చాయి.

ఇది సాధారమైన విషయం కాదు, ఇక్కడితో ఈ సినిమా రన్ ఏమి ఆగిపోలేదు.

ఫుల్ రన్ లో 1 మిలియన్ డాలర్ మార్కుకి కూడా చేరుకునే అవకాశం ఉందట.

అదే కనుక జరిగితే ఈ ఏడాది 'సమజవరగమనా' చిత్రం తర్వాత ఆ రేంజ్ లాభాలను తెచ్చిన చిత్రం ఈ 'కీడా కోలా' చిత్రం నిలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రేంజ్ లాభాలను దక్కించుకుంటుంది ఈ చిత్రం.ఇప్పటి వరకు ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి నాలుగు కోట్ల రుపాయిలకు పైగా షేర్ ని రాబట్టింది అట.

"""/" / ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తూ పోతే ఫుల్ రన్ లో పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాదిస్తుందని, తరుణ్ భాస్కర్ కెరీర్ లో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వుదని అంటున్నారు.

సోమవారం రోజు ఈ సినిమాకి A సెంటర్స్ లో పర్వాలేదు అనే రేంజ్ వచ్చాయి కానీ, బీ, సి సెంటర్స్ లో మాత్రం మొదటి రోజు నుండే వసూళ్లు బాగాలేవు.

ఓవరాల్ గా ఈ చిత్రం A సెంటర్స్ లో మంచి రన్ వచ్చే లాగ అనిపిస్తుంది.

మరి ఏమి జరగబోతుంది అనేది చూడాలి .

దేవర సెప్పినాడంటే చేస్తాడని.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాల్లో నటిస్తున్నాడుగా!