కేసీఆర్ టార్గెట్ ' లక్ష ' ! టీఆర్ఎస్ నేతల పరుగో పరుగు ?

మునుగోడు ఉప ఎన్నికలనే ప్రస్తుతానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు అన్ని రకాలలను ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం మునుగోడులో గెలుపే లక్ష్యంగా కెసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని టిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

దీనిలో భాగంగానే ఆగస్టు 20వ తేదీన కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.

ఈ సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు , మంత్రులు ఎమ్మెల్యేలకు మండలాల వారిగా బాధ్యతలను అప్పగించారు.

కెసిఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అంతకంటే ఎక్కువ స్థాయిలో నియోజకవర్గంలో గ్రామాలు మండలాల వారిగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సి లు ఇతర కీలక నాయకులు సక్సెస్ చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు లక్ష మందిని ఈ సభకు తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు పని చేస్తున్నారు.

కేసీఆర్ కూడా లక్ష మందికి పైగా జనాలు ఉండి తేరాల్సిందే అనే షరతు విధించడంతో పార్టీ నాయకులు ఆ మేరకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

మునుగోడులో మూడుసార్లు కెసిఆర్ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు మండలాల వారిగా జన సమీకరణ మీదే దృష్టి పెట్టారు.

  """/"/ ఒక్కో మండలం నుంచి కనీసం 15 వేల మందికి పైగా జనాలను సమీకరించాలనే విధంగా ఏడు మండలాల్లోనూ జన సమీకరణ చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

నల్గొండ జిల్లాకు ఇంచార్జిగా ఉన్న ఇందన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ బాధ్యతలను చూస్తున్నారు.

జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు ఒక్కో మండలానికి ఇంచార్జీ బాధ్యతలను తీసుకున్నారు.

ఇక జిల్లాలోను,  అలాగే మునుగోడు నియోజకవర్గం లోనూ టీఆర్ఎస్ నాయకులు పూర్తిగా కేసీఆర్ సభను సక్సెస్ చేసే విషయంపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడుతూ గ్రామాల్లోకి , జనాల్లోకి వెళ్తున్నారు.

ఇది న్యాయమేనా పవన్.. హరిహర వీరమల్లు సినిమాకు దర్శకుడిని మార్చేశారా?