కే‌సి‌ఆర్ సెంటిమెంట్ అస్త్రం.. ఫలిస్తుందా ?

వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ( BRS )ను గద్దె దించేందుకు విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయా ? అందుకోసం అన్నీ పార్టీలు ఏకమౌతున్నాయా ? అంటే అవునన సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరి అన్నీ పార్టీలు ఒకవైపు బి‌ఆర్‌ఎస్ పార్టీ ఒకవైపు ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కే‌సి‌ఆర్ ఎలాంటి వ్యూహాలను అమలు చేయనున్నారు ? అనేది ఆసక్తికరంగా మారిన ప్రశ్న.

ముఖ్యంగా ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తెగ ప్రయత్నిస్తోంది.అందులో భాగంగానే తమకు అనుకూలమైన పార్టీలను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు హస్తం నేతలు.

"""/" / నిన్నటి వరకు ఒంటరి పోరు చేస్తామని చెప్పుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) అనూహ్యంగా ఎన్నికల నుంచి తప్పుకొని భేషరతుగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు.

అటు టీడీపీ కూడా ఎలక్షన్స్ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు పరోక్ష మద్దతు తెలిపేందుకు అడుగులు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అటువైపు బీజేపీ జనసేన పొత్తు కూడా దాదాపు ఖాయమయ్యేలా కనిపిస్తోంది.ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే టీడీపీ జనసేన పార్టీలు ఏపీలో పొత్తులో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ కాంగ్రెస్ ( Congress )ను అలాగే జనసేన పార్టీ బీజేపీని కలిపి ఒక కూటమిగా మరి మహాకూటమిగా బి‌ఆర్‌ఎస్ ను ఎదుర్కొనేందుకు తెర వెనుక కసరత్తులు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

"""/" / ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్( CM Kcr ) సెంటిమెంట్ అస్త్రానికి పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల టైమ్ లో కూడా అన్నీ పార్టీలు ఏకమై బి‌ఆర్‌ఎస్( BRS ) కు చెక్ పెట్టె ప్రయత్నం చేశాయి.

అప్పుడు కూడా తానొక్కడినే ఒకవైపు అనే సెంటిమెంట్ ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు కే‌సి‌ఆర్.

ఆ సెంటిమెంట్ బలంగా వర్కౌట్ అయి అధికారంలోకి వచ్చారు.ఇప్పుడు కూడా దోపిడి దారులంతా ఒకవైపు ప్రజాపాలన ఒకవైపు అనే నినాదంతో మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు గులాబీ బాస్.

మరి ఈ సారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

అల్లు అర్జున్ గురించి దారుణమైన విషప్రచారం.. ఖండించకపోతే ఇబ్బందేనా?