కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం..: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
TeluguStop.com
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ను ఓడిస్తారని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలవడం ఖాయమన్నారు.కేసీఆర్ తన అవినీతి డబ్బుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలిందన్న సిద్ధరామయ్య బీజేపీ అభ్యర్థులకు అయితే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు.
వైరల్ వీడియో: నిల్చొని పనిచేయండి అంటూ ఉద్యోగులకు సీఈవో పనిష్మెంట్..