హుజురాబాద్ అనుభవంతో కెసీఆర్ సరికొత్త ఎత్తుగడ... వ్యూహం ఫలించేనా?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఒక్కసారిగా ప్రజలందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే కెసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది.

అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుల నియామకం అనేది జరిగింది.

అయితే ఇక ఇప్పటికే క్షేత్ర స్థాయిలో చాలా రకాల మంత్రాంగం జరిగిన తరువాత ఈ నియామకం అయిన పరిస్థితి ఉంది.

అయితే జిల్లా అధ్యక్ష పదవి గురించి చాలా రకాలుగా జిల్లా ద్వితీయ శ్రేణి క్యాడర్ మంత్రాంగం జరిపినా కెసీఆర్ మెజారిటీగా ఎమ్మెల్యేల వైపే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది.

అయితే హుజురాబాద్ ఎఫెక్ట్ అనేది కెసీఆర్ లో సరికొత్త ఆలోచనను రేకెత్తించిన పరిస్థితి ఉంది.

అందుకే ఇక నుండి నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ప్రోత్సహించాలని కెసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

హుజురాబాద్ లో ఈటెల ఒక్కరినే ప్రోత్సహించడం ద్వారా టీఆర్ఎస్ ఎలాగైతే ఓటమికి గురైందొ అటువంటి ఫలితం మరల ఏ నియోజకవర్గంలో రాకుండా ఇప్పటినుండే పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉండడంతో పార్టీని ఇంకా మరింతగా చక్కదిద్దడానికి సమయం ఉంటుందనేది కెసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

అయితే కెసీఆర్ ఎమ్మెల్యేలనే అధ్యక్షులుగా ప్రకటించడంతో   అధ్యక్ష పదవిని ఆశించిన నాయకులు ఇప్పటి వరకు ఉన్నంత యాక్టివ్ గా ఉంటారా అంటే కొంత ప్రశ్నార్థకమనే చెప్పాలి.

"""/"/ ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో ఏది చేయాలన్నా డబ్బుతో పని.అయితే ఇక అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఎంతో కొంత ఖర్చు చేస్తేనే పార్టీ కార్యక్రమాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి.

మరి పార్టీ పటిష్టతకు ప్రాధాన్యతనిచ్చి నూతన అధ్యక్షుల సారథ్యంలో పనిచేస్తారా లేక అంతర్గత విభేదాలు మొదలవుతాయా అనేది చూడాల్సి ఉంది.

CM Jagan : రెండో రోజు బస్సు యాత్రలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!