మరో కొత్త సాంగ్ పై కేసీఆర్ మనవడు హిమాన్షు ప్రకటన
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్షు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
ఆయన మరో కొత్త సాంగ్ తో ఆలరించబోతున్నట్లు తెలిపారు.ఆ పాటను ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పాటను ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో తెలిపారు. """/" /
కాగా హిమాన్షు ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
హిమాన్షు కొత్త సాంగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.అయితే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన గేయ రచయిత, సింగర్ జాకబ్ లాసన్ పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ ను హిమాన్షు గతంలో ఆలపించిన సంగతి తెలిసిందే.
కాగా ఇంగ్లీష్ సాంగ్ పాడటంతో హిమాన్షు ఆ యాసను ఉచ్చరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
నీతులు చెప్పడమే కాదు పాటించాలిగా.. అనంత్ శ్రీరామ్ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పై విమర్శలు?