గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయం..: రేవంత్ రెడ్డి
TeluguStop.com

మానకొండూర్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు.కామారెడ్డి, గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని రేవంత్ రెడ్డి తెలిపారు.


మానకొండూర్ కు రసమయి బాలకిషన్ చేసిందేమీ లేదని ఆరోపించారు.రసమయి తెలంగాణ పాటను సైతం దొర గడీల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి తోటపల్లి రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ వస్తుంది.ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
లైవ్‌లో జర్నలిస్ట్ కాలర్ సరిచేసిన పెద్దాయన.. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా..