కేసీఆర్ పాలనా వ్యవహారం అస్తవ్యస్తం: ప్రొఫెసర్ కోదండరాం

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, విచ్చలవిడిగా పరీక్ష పత్రాలు లీకవడమే దీనికి నిదర్శనమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా రెతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా శుక్రవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు.

అనంతరం హుజూర్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గంగా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడడం దురదృష్టకరమన్నారు.

తన కూతురికి అన్యాయం జరిగితే మంది మార్బలంతో విమానంలో ఢిల్లీకి వెళ్లి,కేసు గురించి కొట్లాడుతున్నరని విమర్శించారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమమైన పనిచేస్తే ఆ కేసు విషయం అక్కడి ప్రభుత్వం చూసుకుంటుందని,ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

కేసీఆర్ బిడ్డ కోసం రాద్ధాంతం చేస్తున్న వారు, పరీక్ష పత్రాల లీకేజీల్తో ఆగమైన విద్యార్థుల పరిస్థితిపై ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.

నిరుద్యోగుల,విద్యార్థుల జీవితాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు.తెలంగాణ బిడ్డలపై ప్రేమ లేదన్నారు రాజ్యాంగపరంగా పోరాడి పిల్లలకు న్యాయం జరిగే వరకు రైతు,ప్రజా,విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కదలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యువజన సమితి జిల్లా రాష్ట్ర నాయకులు తెలంగాణ జన సమితి పార్టీ నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొన్నారు.

వీడియో వైరల్: హైవేపై కారు ఆపి కత్తులతో దాడి.. దోచుకోవడానికి దుండగుల యత్నం..