టార్గెట్ ఈటెల.. గజ్వేల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్..!!

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఇవాల్టి నుండి నామినేషన్ల స్వీకరణ మొదలైంది.

ఇక తెలంగాణలో హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ (BRS) ప్రచారాల మీద ప్రచారాలు చేస్తోంది.

ఇప్పటికే కెసిఆర్ కామారెడ్డి( Kamareddy ), గజ్వేల్ లో రెండు చోట్ల పోటీ చేస్తారని చెప్పారు.

అలాగే తన ప్రత్యర్థులపై వ్యూహాలు పన్నుతూ ఎలాగైనా ఈసారి మళ్లీ పై చేయి సాధించాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బిజెపి నుండి గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటెల రాజేందర్ పోటీపడుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈటెల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో గజ్వేల్ లోని ముదిరాజ్ కులస్తులు అందరూ తనకే ఓటు వేస్తారనే ధీమాతో ఉన్నారు.

అంతేకాదు ముదిరాజ్ వర్గానికి గజ్వేల్ ( Gajwel ) లో కేసీఆర్ చేసింది ఏమీ లేదని,తనని గెలిపిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే గజ్వేల్ లోని ముదిరాజ్ లు కూడా కేసీఆర్ తమకి ఎలాంటి న్యాయం చేయడం లేదని అసహనంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎలాగైనా గజ్వేల్ లోని ముదిరాజ్ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారు.

ఇందులో భాగంగానే ఎర్రవెల్లి లోని కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఈటెల రాజేందర్ ( Etela Rajender ) ముదిరాజ్ కులస్తులను ఎవరిని ఎదగనివ్వలేదని,అందుకే ఆయన మీద నమ్మకం పోయి కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ), బండ ప్రకాష్ ని పార్టీ లోకి ఆహ్వానించామని, ఇక ఎన్నికలు ముగిశాక ముదిరాజులందరితో కలిసి పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుందామని, అలాగే ముదిరాజ్ కులస్తులకు ఎమ్మెల్సీ,ఎంపీ స్థానాలను ఇస్తామని, ఎందుకంటే ముదిరాజ్ కులస్తుల నుండి కూడా నాయకులు తయారవ్వాలని అంటూ ముదిరాజ్ కులస్తులకు అనుకూలంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

"""/" / అయితే కెసిఆర్ కేవలం గజ్వేల్ లో ముదిరాజ్ ఓటర్లను ఆకట్టుకునేందుకే డు ఇలాంటి వ్యాఖ్యలు చేసారని,రెండుసార్లు గెలిస్తే ఏం చేశారు ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారు.

ఒకసారి తెలుసుకొని ఓటేయాలి అని బిజెపి వాళ్లు ప్రచారం చేస్తున్నారు.మరి చూడాలి గజ్వేల్ లో కేసీఆర్ ( KCR) పరిస్థితి ఎలా ఉంటుందో.

వర్సిటీ క్యాంపస్‌లో లోదుస్తులతో విద్యార్థిని నిరసన.. మ్యాటరేంటంటే?