ప్రచార జోరు పెంచిన గులాబీ బాస్.. చేవెళ్లలో భారీ బహిరంగ సభ

లోక్ సభ ఎన్నికలకు( Loksabha Elections ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీ ప్రచారంలో వేగం పెంచుతోంది.

ఇప్పటికే కరీంనగర్ కదనభేరీతో ఫుల్ జోష్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఇవాళ చేవెళ్ల నియోజకవర్గంలో( Chevella Constituency ) బహిరంగ సభను నిర్వహించనుంది.

సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ భారీ సభకు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్( KCR ) హాజరుకానున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహన్ని నింపనున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు.

కాగా ఇప్పటికే సభా ఏర్పాట్లను పూర్తి చేసిన పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సభకు సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

మహా కుంభమేళా 2025 : ఎన్ఆర్ఐల కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు