కేసీఆర్ వరంగల్ టూర్.. అధికారులకు షాక్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్ టూర్ విషయంలో అధికారులకు పెద్ద షాక్ తగిలింది.

మొదట కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తారని అంతా అనుకున్నారు.ఇదే విషయంపై మీడియాలో అనేక రకాల వార్తలు కూడా వచ్చాయి.

కేబినేట్ భేటీకి ముందు మంత్రులు కూడా ఇదే విషయం పక్కా అని అంటున్నారని లీకులు కూడా వచ్చాయి.

ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాడనుకుని అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.కేసీఆర్ జిల్లా పర్యటనకు అంతా సిద్ధం చేశారు.

కానీ చావు కబురు చల్లగా చెప్పినట్లు అసలు విషయాన్ని కేబినేట్ భేటీ తర్వాత మెల్లగా రివీల్ చేశారు.

ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

అంతే కాకుండా అక్కడి రైతులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు.ఇంతకీ రైతులు నిరాశ పడడానికి గల కారణం ఏమిటంటే.

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా చోట్ల పంటలు దెబ్బ తిన్నాయి.

ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళ్తారని ఈ సందర్భంగా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తాడని అంతా అన్నారు.

అంతే కాకుండా పంట నష్టం గురించి నివేదికను కూడా ఆయన అధికారులకు ఇస్తాడని, పంటలకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలో అనే విషయాలను ప్రకటిస్తారని రైతులంతా ఆశగా ఎదురు చూశారు.

"""/" / కానీ రైతుల ఆశల మీద నీళ్లు చల్లారు.ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళ్లడం లేదని ఆయన స్థానంలో మంత్రుల బృందం వెళ్తోందని చాలా తాపీగా చెప్పారు.

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన కొంత మంది మంత్రులు ఈ పర్యటనకు వెళ్తారని అధికారులు కేబినేట్ భేటీ తర్వాత ప్రకటించారు.

Ram Charan : రామ్ చరణ్ ఎంత మంచి వాడంటే ఆయన ఫ్రెండ్ కోసం అంత పని చేశాడా..?