జనానికి షాక్ మీద షాకిస్తున్న కేసీఆర్!
TeluguStop.com
పేరుకు ధనిక రాష్ట్రం.మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం.
దేశంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాల్లో ఒకటి.ఇదీ తెలంగాణ గురించి సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే మాటలు.
అయినా తెలంగాణ ప్రజలకు మాత్రం ఏదో ఒక రూపంలో ఆర్థిక భారం మాత్రం తప్పడం లేదు.
ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే.చివరికి చార్జీల పెంపు అంటూ ప్రజలపైనా భారం మోపారు.
ప్రజలు భారం మోయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కేసీఆరే ఓ ప్రకటన చేసేసి.చార్జీలు పెంచేశారు.
ఆ తర్వాత మద్యం ధరలు పెంచేసి ఏడాదికి అదనంగా మరో నాలుగు వేల కోట్ల వరకూ మందుబాబుల నుంచి పిండుకోవాలని నిర్ణయించారు.
చివరికి ప్రభుత్వ పరిధిలో ఉండే విజయ పాల ధరలను కూడా పెంచారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/12/KCR-wants-to-Hike-mandu-Retlu-in-Telangana-కేసీఆర్!--jpg" /ఇక ఇప్పుడు మరో భారం మోపడానికి సిద్ధమవుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల కారణంగా ఆ భారం కాస్త ఆలస్యమవుతోంది తప్ప.ఆ ఎన్నికలు ముగిశాయంటే బాదుడు తప్పదు.
ఈసారి వంతు కరెంటు చార్జీలది.నాలుగేళ్లుగా డిస్కమ్‌లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
ఇన్నాళ్లూ వాటిని భరిస్తూ వచ్చిన సంస్థ.ఇక తమ వల్ల కాదని మొండికేస్తున్నాయి.
దీనికితోడు రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుండటం, విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచే రూ.
9 వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంలాంటివి డిస్కమ్‌ల నష్టాలను పెంచుతున్నాయి.దీంతో చార్జీల పెంపు తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
మున్సిపల్ ఎన్నికలు కాగానే ఈ చార్జీల పెంపు ప్రతిపాదనను టీఆఎస్‌ఈఆర్సీకి సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమాల్లో పవర్ స్టారే.. రాజకీయాల్లో కూడా పవర్ స్టారే.. న్యాచురల్ స్టార్ కామెంట్స్ వైరల్!