గెలుపు పై కేసీఆర్ ధీమా..వైఎస్ ఫార్ములా పై ఆశలు
TeluguStop.com
తెలంగాణా రాజకీయాలు ఇప్పుడు ఏపీలో అతిపెద్ద హాట్ టాపిక్ , ఏపీలో మాత్రమే కాదు యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తున్నది తెలంగాణలో ఎవరు గెలుస్తారనే ఆత్రుతతో ఎందుకంటే ఒక్క కేసీఆర్ ని ఓడించడానికి టీడీపీ,కాంగ్రెస్ లు జట్టు కడుతాయనియా ఊహలకి కూడా అందలేదు కానీ ఈ రెండు పార్టీలతో పాటు ఇప్పుడు వామపక్షాలు, అదేవిధంగా కొత్తగా కోదండరాం ఏర్పాటు చేసిన పార్టీ సైతం కాంగ్రెస్ తో జట్టుకడుతున్నాయి అంటే కేసీఆర్ హవా తెలంగాణలో ఎంత బలంగా ఉందొ ఒక్కసారి ఊహించుకోవచ్చు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మూడు పార్టీల సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు కూడా అంతేకాదు Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇప్పుడు కూటంలో జట్టు కట్టిన పార్టీలన్నీ కూడా వారి వారి మ్యానిఫెస్టో లని కలిపి కూటమికి తగ్గట్టుగా అన్నిటిలో యునిక్ గా ఉన్న వాటిని పొందు పరిచి మహాకూటమికి కూడా ఒక అద్భుతమైన మ్యానిఫెస్టో రూపొందిచాలని ఒక పక్కా ప్రణాళిక వేసుకున్నాయి.
అంతేకాదు ఇప్పటివరకూ తెలంగాణలో ప్రజలు కేసీఆర్ వచ్చాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇలా లెక్కలు బొక్కలు వెతుక్కుంటూ ఒక పుస్తకాన్ని కూడా సిద్దం చేస్తున్నారట అంతేకాదు కేసీఆర్ ని ఎదుర్కోవడానికి ఎన్ని వ్యూహాలు రచించాలో అన్నిటిని సిద్దం చేసి పెట్టుకున్నారట.
సరే ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.ప్రాణాలకి సైతం తెగించి తెలంగాణా సాధించిన కేసీఆర్ ముందు గోడమీద పిల్లిలా వ్యవహరించిన టీడీపీ కుప్పిగంతులు పని చేయవని.
ఇక కాంగ్రెస్ లాంటి అభివృద్ధి కంటకుల పన్నాగాలు ఎన్నటికీ సాగవని టీఆర్ఎస్ పార్టీ చాలా తేలిగ్గా తీసిపడేస్తోంది.
అంతేకాదు మహాకూటమి మట్టి కరిచేలా.కేసీఆర్ ముందు మోకరిల్లేలా కూటమిలో పార్టీ అధినేతలకి దిమ్మతిరిగిపోయెలా భారీ షాక్ ఇవ్వనున్నారట.
అందుకోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ఫాలో అవనున్నాడట కేసీఆర్.అదేంటి వైఎస్ ని ఫాలో అవడం ఏమిటి అంటుకుంటున్నారా.
అసలు విషయం ఏమిటంటే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పీడు కి బ్రేకులు వేయాలని వైఎస్ జోరు తగ్గించడానికి టీడీపీ ,అప్పుడే పుట్టిన చిరు పార్టీ ప్రజారాజ్యం, వామపక్షాలు శతవిధాలుగా విడి విడిగానే ప్రయత్నించాయి.
టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారంలోకి దింపగా చిరు ,పవన్ కళ్యాణ్ లు వైఎస్ పై విర్చుకు పడేవారు పార్టీలు వేరైనా సరే అందరి టార్గెట్ ఒక్క వైఎస్ అయితే వైఎస్ ఎంతో ధైర్యంగా తానూ పెట్టిన పధకాలు, అమలు చేసిన తీరు.
లబ్ది పొందిన వైనం తో ఒంటరిగానే ఒక్కడిగానే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బస్సు యాత్ర ద్వారా తిరిగిగాడు విజయం సాధించుకొచ్చాడు.
అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాని కేసీఆర్ ఫాలో అవనున్నాడట.ఒంటరిగానే మహాకూటమిని ఎదుర్కోవడాని సిద్దపడ్డాడు కేసీఆర్.
ఒక పక్క కేసీఆర్ ఒక్కడే ప్రచారం చేస్తూ వెళ్తుంటే మరో పక్క తనయుడు కేటిఆర్ ,కూతురు కవిత కూడా ప్రచారానికి సిద్దం అవుతున్నారట.
ఏది ఏమైనా సరే టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పదకాలే మళ్ళీ టీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకువస్తాయని ధీమాగా చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు.
విడుదలైన బన్నీ… భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి!