కేసీఆర్ నోట జిల్లాలు.. అస‌లు టార్గెట్ ఏమిటంటే ..

టార్గెట్ పెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డంలో తెలంగాణ సీఎంను మించిన నాయ‌కుడు లేడ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

అలాంటి నాయ‌కుడిపై ఓ మ‌చ్చ కూడా ఉంది.ప్ర‌గ‌తి భ‌వ‌న్ దాటి స‌మాజంలో అడుగు కూడా పెట్ట‌డ‌నే విమ‌ర్శ‌ల‌ను సైతం ఎదుర్కొంటున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ జిల్లాల మాట వినిపిస్తోంది.వ‌రుస ప‌ర్య‌ట‌ను చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

దీనికి ఓ కారణం లేక‌పోలేదు.తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ప‌ర్య‌ట‌న మ‌రింత ప్రాధాన్య‌త‌ను సంత‌రంచుకుంది.

ఈనెల 11 నుంచి ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌ట‌నలు ప్రారంభించ‌నున్నారు.మ‌రోవైపు వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి న్నికలు ఉన్నాయి.

దీనిక‌తోడు బీజేపీని టార్గెట్ చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.అందుకే సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రయ్యేందుకు, వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకే ఈ ప‌ర్య‌ట‌న‌ల‌నే టాక్ వినిపిస్తోంది.

ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా తొలుత జ‌న‌గామ జిల్లాలో కాలు మోప‌నున్నారు.అనంత‌రం నిజామామాబాద్‌, జ‌గిత్యాల‌, యాదాద్రి, భువ‌న‌గిరి, వికారాబాద్‌, త‌దిత‌ర జిల్లాల్లో ప‌ర్య‌ట‌నలు చేయ‌నున్నారు.

కాగా ఇది కొంత‌ కాలంగా పోస్ట్‌పోన్ అవుతూ వ‌స్తోంది.ఈసారి ఎలాగైనా ప‌ర్య‌ట‌నలు పూర్తి చేయాల‌నే క‌సితో ఉన్న‌ట్టు స‌మాచారం.

అలాగే ముజురాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు కూడా అన్ని జ‌ల్లాల్లో ప‌ర్య‌టించారు.ప‌లు అభివృద్ధి, ప్రారంభోత్స‌వాలు చేశారు.

నాడు హుజురాబాద్ ఉప ఎన్నిక కోస‌మే వ‌చ్చిన‌ట్టు బీజేపీ నేతలు ఆరోపించారు. """/" / ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందాక జిల్లా ప‌ర్య‌ట‌న‌లు చేద్దామ‌నుకున్నారు.

కానీ, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్, ఆవెంటనే ఓమిక్రాన్ దృష్ట్యా ప‌ట్టించు కోలేదు.

ఈసారి వ‌రంగ‌ల్ మిన‌హా అంత‌టా ప‌ర్య‌ట‌నల‌కు స‌క‌లం సిద్ధం చేసుకున్నారు.మ‌రో ఏడాదిన్న‌ర త‌రువాత వ‌చ్చే ఎన్నిక‌ల దృష్ట్యా 33 జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌ను నియ‌మించారు.

వారికే నేడు బాధ్య‌తలు అప్ప‌గించ‌నున్నారు.భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి బీజేపీని టార్గెట్ చేసి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పొందే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అన్నం గంజిలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే మీ హెయిర్ డబుల్ అవుతుంది..!