త్రిముఖ వ్యూహంతో ఈటెలను అష్టదిగ్భందనం చేస్తున్న కేసీఆర్...ఎలాగంటే?

తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

అవకాశం దొరికిన ప్పుడల్లా ప్రభుత్వంపై బహిరంగ సభల్లో పరోక్ష విమర్శలు చేస్తూ అసలు మర్మం ఏంటో తెలియకుండా జాగ్రత్తపడుతూ కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు మాజీ మంత్రి ఈటెల.

ఆ తరువాత ఈటెలకు కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది.తాజాగా మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేసాడని సీఎం కేసీఆర్ లు లేఖ రాశారు.

అయితే రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.అయితే తదనంతరం ఈటెల కేసీఆర్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఇక ఈటెల పై అగ్రహించిన కేసీఆర్ అష్టదిగ్భందన వ్యూహానికి తెర దీసాడు.మొదటగా మూసాయిపేట భూముల అంశాన్ని తెర మీదికి తీసుకొస్తూ విచారణను వేగవంతం చేస్తూ ఒక వైపు, దేవరయాంజల్ భూముల కొనుగళ్లపై ఇప్పటికే విచారణ కమిటీని వేగవంతం చేసిన కేసీఆర్, ఇక పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న కారణంగానే మంత్రులతో ఈటెల ఆరోపణలు తిప్పి కొడుతూ ఈటెలకు ధీటైన రీతిలో సమాధానం ఇవ్వడం లాంటి వ్యూహాలతో ఈటెలను ఇరుకున పెడుతూ రాజకీయంగా దెబ్బ తీయాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

వైరల్ వీడియో: ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..