KCR : రైతులకు కేసీఆర్ ఓదార్పు.. నేటి నుంచే యాత్ర

త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికలను( Loksabha Elections ) దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ జనాల్లోకి వెళ్లి, బీఆర్ఎస్ కు ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దీనిలో భాగంగానే నేటి నుంచి రైతులతో భేటీ కాబోతున్నారు.కరెంట్ కోతలు, సాగునీటి దుర్భిక్ష పరిస్థితులపై రైతులను పరామర్శించి ఓదార్చనున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని సెంటిమెంట్ ను ప్రజల్లో రగిల్చే ప్రయత్నం మొదలుపెట్టబోతున్నారు.

బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్న మొదటి పర్యటన కావడంతో దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు.

బిఆర్ఎస్ శ్రేణుల్లో( BRS Activists ) ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోవడంతో, వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడంతో పాటు, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవాలనే డిమాండ్ ను కేసీఆర్( KCR ) వినిపించబోతున్నారు.

"""/"/ ప్రతిపక్ష నేతగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను సూర్యాపేట, నల్గొండ( Nalgonda ), జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కొనసాగించనున్నారు.

ఆయా ప్రాంతాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను స్వయంగా కేసీఆర్ పరిశీలిస్తారు.ఈరోజు ఉదయం 8.

30 గంటలకు కెసిఆర్ ఎర్రవల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.

జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు.

అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు.11 గంటలకు సూర్యాపేట జిల్లా( Suryapet )లోని తుంగతుర్తి మండలం, ఆర్వాపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు.

"""/"/ మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి 1.

30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు( Suryapet MLA Camp Office )కు చేరుకుంటారు.

అక్కడే మధ్యాహ్నం భోజనం చేస్తారు.అనంతరం మూడు గంటలకు మీడియాతో మాట్లాడుతారు.

ఉదయం 3.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరుతారు.

సాయంత్రం 4.30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంట పొలాలను( Damaged Crops ) పరిశీలిస్తారు.

ఆ తరువాత రోడ్డు మార్గం ద్వారా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటారు.

ముంబై నటి వేధింపుల కేసు : వారిపై ‘సజ్జల’ పరువు నష్టం దావా