ఈనెల 27న మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్
TeluguStop.com
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.
ఇందులో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈనెల 27న కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.శనగపురం రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు పార్టీ నేతలు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.
హెయిర్ ఫాల్, డ్రై హెయిర్.. రెండింటికి చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ జెల్ ఇది..!