ఈ దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన లేనంటేనా?

ఎంతో ఆర్భాటాల మధ్య ప్రకటిస్తారు అనుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ఈ విజయదశమికి వాస్తవరూపం దాల్చకపోవచ్చు.

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలా వద్దా అనే విషయంపై కేసీఆర్ రెండో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు కచ్చితమైన ర్యూట్ మ్యాప్ ఏమీ లేదు.

కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో తన మంత్రివర్గ సహచరులు, తన సన్నిహితులతో జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చించినప్పటికీ, కేసీఆర్ ఇంకా సరైన నిర్ణయానికి రానట్లు తెలుస్తుంది.

జాతీయ పార్టీల్లోకి రావాలని కేసీఆర్‌ను అభ్యర్థిస్తూ పలు రైతు సంఘాలు, ఇతర సంఘాలు తీర్మానాలు చేపినప్పటికి ఆయన రెండో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే, విజయదశమి సమీపిస్తున్నప్పటికీ, జాతీయ పార్టీ ప్రకటనపై స్పష్టమైన కార్యచరణ ఏమి లేనట్లుగా తెలుస్తుంది.

అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాతే పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇతర రాష్ట్రాల్లో పార్టీ ప్రతినిధులను నియమించిన తర్వాతే ప్రకటన చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.జాతీయ స్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ప్రతిరోజూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

"""/" / కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి వస్తున్న స్పందన చూసి కేసీఆర్ నిరాశకు గురయ్యారని కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

తేజస్వీ యాదవ్‌, ఎంకే స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, దేవెగౌడ, హెచ్‌డి కుమార స్వామి, అఖిలేష్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌ వంటి విపక్ష నేతలను వ్యక్తిగతంగా కలిసినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

అందుకే, జాతీయ పార్టీని ప్రకటించే విషయంలో ఆయన వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవలంబించినట్లు చెబుతున్నారు.

Kodali Nani : ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!