బీజేపీ ని టార్గెట్ చేసిన కేసీఆర్ .. ఆందోళనలో కాంగ్రెస్

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో 2024 ఎన్నికలు టార్గెట్ గా కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ వ్యవహరించినట్లు గా కనిపించినా,  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

2024 ఎన్నికల్లో బీజేపీ , టిఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంటుందనే విధంగానే కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు.

అందుకే ఆ పార్టీని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ప్రభావం కనిపించకుండా చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ఢిల్లీ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నిటినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ని ఓడించేందుకు వ్యూహాలను కేసీఆర్ రచిస్తున్నారు.

       దీనికి తగ్గట్లుగానే తెలంగాణ బీజేపీ నాయకులు వ్యవహారాలు చేస్తున్నారు.టిఆర్ఎస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి జాతీయ నాయకుల వరకు అంతా భారీ స్టేట్మెంట్లు ఇస్తూ,  ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు.

ఈ వ్యవహారం ఇలా ఉంటే , ఈ రెండు పార్టీల మధ్య పెరిగిన వైరాన్ని చూసి కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.

ఎందుకంటే బీజేపీ వ్యతిరేక పార్టీల లిస్టులో కాంగ్రెస్ కూడా ఉంది.కానీ కాంగ్రెస్ ను ఈ ప్రాంతీయ పార్టీలు పరిగణలోకి తీసుకోకపోవడం , కాంగ్రెస్ తమతో కలిసి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని,  ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదు అనే అంచనాలో ఉండటంతో  కాంగ్రెస్ ను మరింత దూరం పెడుతూ వస్తున్నాయి.

    """/"/   అయితే ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ ను కూడా కలుపుకుని వెళితే అప్పుడు తమ పరిస్థితి ఏమిటనేది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ పుట్టిస్తోంది.

ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారు.తమ ప్రధాన శత్రువు టిఆర్ఎస్, కెసిఆర్ అన్నట్లుగానే పోరాటం చేస్తున్నారు.

కానీ జాతీయ స్థాయిలో ఒకే కూటమిలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పని చేయాల్సి వస్తే అప్పుడు ప్రజల్లో చులకన అవుతాము అన్న భావన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో నెలకొంది.

జిమ్ ట్రైనర్ ను మోసం చేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!