50 వేల మంది మాజీలేనా?
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నంత పని చేశారు.అంత సాహసం చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన వారికి, అంత సీన్‌లేదులే అన్న వారికి కేసీఆర్ మైండ్ బ్లాక్ చేశాడు.
సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులందరిని కూడా నిర్ధక్షిణ్యంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లుగా ప్రకటించాడు.
గడువు లోపు డిపోల్లొ రిపోర్ట్ చేయని వారందరిని కూడా ఉద్యోగల నుండి తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అందుకు సంబంధించిన ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని డిపోల్లోకి వెళ్లాయి.ఆర్టీసీ ఎంప్లాయిస్ ఈ నిర్ణయంతో షాక్ అవుతున్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ సమ్మె కొనసాగుతుందని చెబుతున్నారు.మరో వైపు ఆర్టీసీలో కొత్త నియామకాల కోసం దరకాస్తులు తీసుకోవాలంటూ కూడా నిర్ణయించారు.
మొత్తానికి హడావుడిగా జరుగుతున్న పరిణామాలు కొందరికి గందరగోళం సృష్టింస్తుంటే నిరుద్యోగులకు మాత్రం ఆశలను కల్పిస్తున్నాయి.
ఆర్టీసీ ఎంప్లాయిస్ ప్రస్తుతం కేవలం 1200 మంది మాత్రమే ఉన్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు.
కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు కసరత్తు మొదలు పెడుతున్నట్లుగా సీఎం ప్రకటించడం జరిగింది.
ఇదే నిర్ణయంపై కేసీఆర్ ఉంటారా లేదంటే ఎంప్లాయిస్‌పై దయ చూపి వెనక్కు తగ్గుతాడా అనేది చూడాలి.
దాదాపు 50000 వేల మంది ఉద్యోగులు అంటే వారిపై ఆధారపడి దాదాపుగా 5 లక్షల మంది ఉంటారు.
మరి వారందరి పరిస్థితి ఏంటో?.
కొడుకు డైరెక్ట్ చేసిన సినిమాకు తండ్రి రేటింగ్ ఎంతిచ్చారంటే?