మేధావులకు, ఉద్యమకారులకు కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి

మేధావులకు, ఉద్యమకారులకు కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి

సూర్యాపేట జిల్లా: ప్రొఫెసర్ హారగోపాల్,కాసిం లాంటి మేధావులు, ఉద్యమకారుల పైన కేసీఆర్ అక్రమ కేసులు పెట్టించడం ఇబ్బందులకు గురి చేసి,వాటిని ఎత్తివేయడం చేస్తునందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.

మేధావులకు, ఉద్యమకారులకు కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి

శనివారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి,నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

మేధావులకు, ఉద్యమకారులకు కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మేధావులు,వామపక్ష ఉద్యమకారుల మద్దతుతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి నేడు ఆ మేధావులు, వామపక్ష ఉద్యమకారుల పైన ఉపా కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు.

ఉపాకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను చూసి మేధావుల, ఉద్యమకారుల పైన అక్రమ కేసుల గురించి, కేసీఆర్ చేసిన తప్పు తెలుసుకొని ఉద్యమకారుల, మేధావులపైన కేసులు ఎత్తివేసి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.

దానితోపాటు ముందుగా అక్రమ కేసులు బనాయించినందుకు ప్రో.హరగోపాల్, మేధావులకు , ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వస్తే నక్సలైట్ల పాలన తెస్తానని చెప్పిన కేసీఆర్ ఈరోజు నక్సలైట్ల పైన,ఉద్యమకారుల పైన అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

ఇదంతా మోడీని మెప్పించేందుకే అతని సూచన మేరకే జరుగుతుందని ఆరోపించారు.ఉద్యమకారుల పోరాటాల వల్లనే తెలంగాణ వచ్చిందన్న సంగతి మరిచిపోయి,తెలంగాణ ద్రోహులను తన పక్కన చేర్చుకొని బీజేపీకి ఏజెంట్ గా మారి ప్రజల కోసం పోరాడే వాళ్ళ మీద ఉపాకేసులు కేసులు, పిడి యాక్టులు పెడుతున్నారని లేదా పెడతానని బెదిరిస్తున్నారన్నారు.

అందులో భాగమే సూర్యాపేటలో మా పార్టీ ఆధ్వర్యంలో పేదలకు గుడిలు వేస్తే పార్టీ నాయకుల పైన పీడీ యాక్ట్ పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు.

ఇలాంటి కేసులకు ఉద్యమకారులెవరూ భయపడేవారు కాదని, అనునిత్యం ప్రజా సమస్యల మీద,అవి పరిష్కారమయ్యే వరకు పోరాడుతూనే ఉంటారని ఈ విషయం కెసిఆర్ మరియు వారి మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తుంచుకొని ఉద్యమకారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

లేనియెడల ఈ ఉద్యమకారులే మిమ్ముల గద్దె దింపి మీ అడ్రస్ లేకుండా గల్లంతు చేస్తారని అన్నారు.

గతంలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్లంతా నేడు ఎక్కడున్నారో తెలుసుకోవాలని, ఇకనైనా ఉద్యమకారుల డిమాండ్లను నెరవేరుస్తూ ప్రజలకు ఏమి కావాలో అవి పాలకులు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి.డి.

ఎస్.యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, పార్టీ పట్టణ కార్యదర్శి షేక్ గులాం హుస్సేన్,రామన్న, సింహాద్రి,వాజీద్,రమేష్, సైదులు,నగేష్,జయమ్మ, పద్మ,వీరబాబు,సందీప్, నవీన్,శైలజ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్3, గురువారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్3, గురువారం 2025