Minister Komatireddy : జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలి..: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komati Reddy Venkat Reddy ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

నల్గొండను నట్టేట ముంచిన ఘనత గత ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గుర్తించారు కాబట్టే భారీ మెజార్టీతో ఓడగొట్టారని పేర్కొన్నారు.

ప్రజల తీర్పు చూశాక కూడా కేసీఆర్( KCR ) ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని విమర్శించారు.

అయినా కేసీఆర్ కోసం నల్గొండ చౌరస్తాలో కుర్చీ వేసి ఉంచుతామని చెప్పారు.రాష్ట్ర విభజన తరువాత నీటి కేటాయింపులకు అంగీకరించింది ఎవరని ప్రశ్నించారు.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు గురించి మాట్లాడే అర్హత కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి నల్గొండ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ సపోర్ట్ చేశారని ఆరోపించారు.ఈ క్రమంలో జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఐదేళ్ల పాలనలో రాష్ట్రం నాశనం.. జగన్ పై దేవినేని ఫైర్